https://oktelugu.com/

Nagarjuna: మరో యంగ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమాకి ప్లాన్ చేస్తున్న నాగార్జున…

ప్రస్తుతం నాగార్జున వరుసగా మంచి సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే కుబేర సినిమాలో ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నంటున్న నాగార్జున ఇప్పుడు...

Written By: , Updated On : May 25, 2024 / 10:46 AM IST
Nagarjuna is planning a multi-starrer movie with another young hero

Nagarjuna is planning a multi-starrer movie with another young hero

Follow us on

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకానొక సమయంలో తెలుగు సినిమా స్థాయిని ముందుకు తీసుకెళ్లడంలో ఎన్టీఆర్ చాలా కీలకపాత్ర వహిస్తే,ఆయన తర్వాత ఇండస్ట్రీ కి సేవలను అందిస్తూ ముందుకు తీసుకెళ్లడం లో హీరోగా నాగేశ్వరరావు కూడా చాలా ముఖ్యపాత్ర ను పోషించారు…

ఇక ఇదిలా ఉంటే నాగేశ్వరరావు స్టార్ హీరోగా చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో వెలుగొందారు. ఇక ఆయన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆయన కొడుకు అయిన నాగార్జున కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయమై ఇండస్ట్రీలో ఉన్న నలుగురు సార్ హీరోల్లో తను కూడా ఒక్కడిగా ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగార్జున వరుసగా మంచి సినిమాల్లో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే కుబేర సినిమాలో ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నంటున్న నాగార్జున ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ హీరో అయిన రామ్ తో కలిసి తను ఒక సినిమాలో నటించబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక నిజానికి ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇంకా రానప్పటికీ ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ను కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే తిరుమల కిషోర్ రామ్ తో కలిసి నేను శైలజా, రెడ్ అనే సినిమాలు చేశాడు. ఇక ఇందులో ‘నేను శైలజా ‘ సూపర్ హిట్ అవ్వగా, రెడ్ సినిమా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదని అందుకే ఇప్పటికీ హీరో రామ్ తో మరొక ప్రయత్నం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక దానికి తగ్గట్టుగానే స్టోరీ తను రెడీ చేసుకొని దాన్ని సినిమాగా చేయాలనే ప్రయత్నం లో ఉన్నాడు. ఇక రామ్, నాగార్జున కాంబినేషన్ లో ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాగా దీన్ని తెరకెక్కించాలనే ఉద్దేశ్యం తో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ స్టోరీ ని కిషోర్ తిరుమల ఇప్పటికే నాగార్జునకి చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తుంది. ఇక అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావడానికి మరికొద్ది రోజులు సమయం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి…