Rajinikanth: రజినీకాంత్ కూలీ లో కొందరి మీద పంచులు వేయబోతున్నాడా..?

నిజానికి రజనీకాంత్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. ఆయన స్టైల్ గాని, ఆయన యాక్టింగ్ కి గాని ప్రేక్షకులను కట్టి పడేస్తాయి...

Written By: Gopi, Updated On : May 25, 2024 10:41 am

Rajinikanth is going to satires on some people in Coolie movie

Follow us on

Rajinikanth: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. ఎందుకంటే ఆయన సాధించిన సక్సెస్ లు అలాంటివి…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా దాదాపు 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే తను సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇక దాంతోపాటుగా రజనీకాంత్ ఈ సినిమాలో ఒక చిన్న సీన్ ను కూడా ఆడ్ చేశారట. అదేంటి అంటే తను చంద్రబాబు నాయుడుకి మద్దతుగా తెలుగులో ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన సీనియర్ ఎన్టీయార్ మీద చంద్రబాబు మీద పలు రకాల కామెంట్లయితే చేశారు. ఇక దాన్ని జీర్ణించుకోలేని కొందరు మరో పార్టీ లీడర్లు చాలా విమర్శలైతే చేశారు… ఇక అందుకే ఒకానొక స్టేజ్ లో తను కూడా కొన్ని పంచులతో వాళ్లకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ఒక సీన్ ను రీ క్రియేట్ చేసి వాళ్ళందరికీ బుద్ధి చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎవరైతే తన మీద నెగిటివ్ అభిప్రాయాన్ని తెలియజేశారో వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలా కొన్ని డైలాగులను ఈ సినిమాలో చెప్పబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే రజనీకాంత్ ఈ సినిమా ద్వారా ఎవరైతే తనని విమర్శించారో వాళ్ళందరికీ సమాధానం చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఒక భారీ సక్సెస్ ని సాధించబోతున్నాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి.

నిజానికి రజనీకాంత్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. ఆయన స్టైల్ గాని, ఆయన యాక్టింగ్ కి గాని ప్రేక్షకులను కట్టి పడేస్తాయి… ఇక 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా వరుసగా సినిమాలు చేయడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…