Nagarjuna: మన టాలీవుడ్ లో అత్యంత ప్రశాంతవంతమైన వాతావరణం లో ఉండే హీరోల లిస్ట్ తీస్తే అందులో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ముందు వరుసలో ఉంటాడు. ఇన్నేళ్ల నుండి మనం ఆయన్ని ఇండస్ట్రీ లో చూస్తున్నాం. ఎలాంటి పరిస్థితి వచ్చినా తన టెంపర్ ని చూపించకుండా చిరు నవ్వుతోనే సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. అందుకే నాగార్జున ని అభిమానులు అంతగా ఇష్టపడుతుంటారు. నాగార్జున ని యాంగ్రీ మోడ్ లో మనం చూసింది కేవలం బిగ్ బాస్ షో లో మాత్రమే. అది కూడా కేవలం రెండు మూడు సీజన్స్ లోనే. గత సీజన్ లో కోపం గా ఉండాల్సిన సమయం లో కూడా ఫన్నీ గా ఎపిసోడ్స్ ని నడపడం వల్ల బోలెడంత నెగిటివిటీ ని మూటగట్టుకున్నాడు నాగార్జున. అలాంటి నాగార్జున కి కూడా కోపం రీసెంట్ గా జరిగిన ఒక ఫోటోషూట్ లో రిపోర్టర్ కోపం రప్పించాడు.
Also Read: కవిత వ్యాఖ్యలు.. రేవంత్ చెప్పిన పాముల కథ..మామూలు పంచ్ కాదు ఇది
వివరాల్లోకి వెళ్తే నాగార్జున ఇంటి వద్ద లోపలకు వచ్చిన కొంతమంది అభిమానులకు ఫోటోలు ఇస్తున్నాడు. ఆ తర్వాత బయట తన కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండడాన్ని చూసి నాగార్జున మాట్లాడుతూ ‘ఇక్కడ వీళ్లకు ఫోటోలు ఇస్తున్నాను ఓకే. బయట అంత మంది నాకోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి?, బుద్ధి ఉందా అయ్యా నీకు?, వాళ్ళని ఎందుకు లోపలకు రానివ్వలేదు’ అంటూ అక్కడ ఉన్న రిపోర్టర్ పై మండిపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. నాగార్జున కి తన అభిమానుల పట్ల ఎంత గౌరవం ఉందో చెప్పేవిధంగా ఆయన ప్రవర్తన ఉందని, నాగార్జున అభిమానులు అయ్యినందుకు గర్విస్తున్నాము అంటూ ఈ వీడియో ని చూసిన నాగార్జున అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే సినిమాల్లో తప్ప బయట ఎక్కడా కూడా చూడని నాగార్జున యాంగిల్ ని బయటకు తీసినందుకు ఆ రిపోర్టర్ కి ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే హీరో గా నాగార్జున సాధించిన విజయాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ లో ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేసి, ఎన్నో సంచలన విజయాలను తన ఖాతాలో వేసుకొని, నిన్నటి తరం సూపర్ స్టార్స్ లో ఒకరిగా దశాబ్దాలు కొనసాగాడు. అయితే నాగార్జున రీసెంట్ గానే తన రూట్ ని మార్చి స్పెషల్ క్యారక్టర్ రోల్స్ చేయడానికి మొగ్గు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కుబేర, కూలీ చిత్రాలు వచ్చాయి. కుబేర చిత్రం లో ఆయన క్యారక్టర్ బాగానే ఉంది కానీ, కూలీ లో మాత్రం అసలు బాగాలేదని, తన రేంజ్ కి ఏ మాత్రం సరిపోలేదని, భవిష్యత్తులో ఇలాంటి విలన్ క్యారెక్టర్స్ చేయొద్దు అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులు నాగార్జున ని వేడుకున్నారు. మరి వాళ్ళ మాటలను నాగార్జున పట్టించుకుంటాడో లేదో చూడాలి.
View this post on Instagram