Ghaati Advance Booking Collection: చాలా కాలం తర్వాత లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి(Anushka Shetty) నుండి విడుదల అవుతున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రం ‘ఘాటీ'(Ghaati Movie). క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ లో డైరెక్టర్ క్రిష్ ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఎడాపెడా ఇంటర్వ్యూస్ వరుసపెట్టి ఇచ్చేస్తున్నాడు. కానీ అనుష్క మాత్రం నేరుగా మీడియా ప్రొమోషన్స్ లో పాల్గొనడం లేదు కానీ, ఫోన్ కాల్ సంభాషణ ద్వారా మీడియా కి అందుబాటులోకి వస్తుంది. కెమెరా ని ఎదురుకోవడానికి ఎందుకో అనుష్క ఇష్టం చూపించడం లేదు. కారణం ఏంటో కేవలం ఆమె మాత్రమే చెప్పగలదు. ఇదంతా పక్కన పెడితే ఘాటీ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కాసేపటి క్రితమే బుక్ మై షో యాప్ లో మొదలైంది.
Also Read: బుద్ధి లేదా నీకు అంటూ రిపోర్టర్ పై నాగార్జున ఫైర్.. వీడియో వైరల్!
అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఎంత వసూళ్లను రాబట్టాలి?, అసలే పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఈ సినిమా వరం అవుతుందా?, లేకపోతే భారం అవుతుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. కేవలం ఒక్క నైజాం ప్రాంతం లోనే ఈ చిత్రం 8 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. క్రిష్ గత చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి, అయినప్పటికీ కూడా ఈ రేంజ్ బిజినెస్ జరగడానికి కారణం అనుష్క బ్రాండ్ ఇమేజ్ అని చెప్పొచ్చు. గతం లో ఆమె నటించిన ‘భాగమతి’ చిత్రం నైజాం ప్రాంతం లో 14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇక ఘాటీ థియేట్రికల్ ట్రైలర్ ని చూస్తుంటే మినిమం గ్యారంటీ కంటెంట్ లాగా అనిపిస్తుండడం తో 8 కోట్ల రూపాయిల బిజినెస్ నైజాం ప్రాంతం లో చేసింది. అదే కోస్తాఆంధ్ర ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా 10 కోట్ల బిజినెస్ జరగ్గా, సీడెడ్ ప్రాంతం లో 5 కోట్ల రూపాయలకు బిసినెస్ జరిగింది.
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకు 23 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అంటే మొదటి రోజు ఓపెనింగ్ కచ్చితంగా తెలుగు రాష్ట్రాల నుండి 5 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు రావాలి. ఆ రేంజ్ వసూళ్లు వస్తాయని ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని చూసి చెప్పలేము. ఎందుకంటే బుకింగ్స్ చాలా వీక్ గా ఉన్నాయి. అదే విధంగా ఈ చిత్రం మిగిలిన బాషలన్నిటికి కలిపి ఓవరాల్ గా 52 కోట్ల రూపాయిల బిజినెస్ ని జరుపుకుంది అట. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా వసూళ్లను రాబట్టి కమర్షియల్ సక్సెస్ గా నిలుస్తుందో లేదో చూడాలి.