Nagarjuna film troubles: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీ కి వచ్చిన నాగార్జున కెరియర్ మొదట్లో చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాడు…మొత్తానికైతే స్టార్ హీరోగా నిలబడ్డాడు…ఇక రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాలో విలన్ గా కూడా నటించాడు…ఇక ఈ సినిమాలో ఆయన నటన నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి…ఇక ప్రస్తుతం ఆయన ఇటు హీరో గా, అటు విలన్ గా పలు క్యారెక్టర్స్ ను పోషిస్తూనే ప్రేక్షకుల్లో మంచి ఐడెంటిటిని సంపాదించుకున్నాడు…
ఇక ఇదిలా ఉంటే జీ5 లో జగపతి బాబు ‘జయమ్మూ నిచ్చయమ్మురా’ అంటూ ఒక టాక్ షో ను స్టార్ట్ చేశారు. ఇక ఇందులో మొదటి ఎపిసోడ్ గా నాగార్జున ను ఇంటర్వ్యూ చేశాడు…ఇక ఇందులో నాగార్జున మాట్లాడుతూ కెరియర్ స్టార్టింగ్ లో ఆయనకు కొన్ని ప్లాప్ సినిమాలు వచ్చినప్పుడు విక్రమ్ సినిమాతో తను నిలబడ్డానని చెప్పాడు…
అలాగే మణిరత్నం చేసిన ‘మౌనరాగం’ సినిమా అంటే చాలా ఇష్టమని ఆ సినిమా దర్శకుడు అయిన మణిరత్నం తో ఒక సినిమా చేయాలని అనుకున్నానని చెప్పాడు. ఇక అందులో భాగంగానే మణి రత్నం రోజు వాకింగ్ కి వెళ్ళే పార్క్ కి వెళ్ళి అతనితో మాట్లాడి మనం ఒక సినిమా చేద్దాం సార్ అని అతన్ని అడిగాడట…
Also Read:‘రావు బహదూర్ ‘ సినిమా టీజర్ ఏంటి భయ్యా ఇలా ఉంది…రాజమౌళి ట్వీట్ సంగతేంటి..?
దాంతో అతన్ని అలాగే ఒక వారం రోజుల పాటు రోజు అలా ఫాలో అయ్యానని, వాళ్ల ఇంటి ముందు నిల్చునేవాడినని చెప్పాడు. ఆయన మాత్రం కొద్దిసేపు తనతో మాట్లాడి తర్వాత శెటిల్ ఆడటానికి వెళ్ళేవాడని మొత్తానికైతే గీతాంజలి కథ వీళ్ళ కాంబోలో సెట్ అయిందని చెప్పాడు…ఇక ఈ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడంతో తనకి మంచి పేరు వచ్చిందని ఆయన ఈ షో లో తన అనుభవాలను పంచుకోవడం విశేషం…ఇక ప్రస్తుతం తను చేయబోతున్న ప్రాజెక్ట్ల విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించడం విశేషం…