Coolie vs War 2 Collections: ఈ ఏడాది అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూసిన ‘వార్ 2′(War 2 Movie), ‘కూలీ'(Coolie Movie) చిత్రాలు ఒకే రోజున విడుదలై రెండు సినిమాలకు డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘కూలీ’ చిత్రం లో కొన్ని అద్భుతమైన మూమెంట్స్ ఉండడం తో మొదటి లాంగ్ వీకెండ్ లో ఆ చిత్రమే పై చెయ్యి సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంతే, మొదటి రోజు నుండే కూలీ చిత్రం ‘వార్ 2’ పై డామినేషన్ చూపిస్తూ వచ్చింది. ఒక డబ్బింగ్ సినిమా మన టాలీవుడ్ స్టార్ హీరో పై ఆధిపత్యం చూపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి, అందులో భాగంగానే ఈ అరుదైన ఘటన కూడా జరిగింది. కానీ తెలుగు వెర్షన్ ఎలా ఉన్నా, హిందీ లో మాత్రం హృతిక్ రోషన్ తన అసాధారణమైన బాక్స్ ఆఫీస్ స్టామినా తో ఈ సినిమాకి వీకెండ్ వరకు భారీ వసూళ్లను రాబట్టాడు.
ఫలితంగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి నాలుగు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 275 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ వసూళ్లు కాస్త అయినా సహకరించి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, మొదటి రోజు నుండే ఇక్కడి ఆడియన్స్ సహకరించలేదు. ఇక కూలీ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. లాంగ్ వీకెండ్ లో ఈ రేంజ్ భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి, వాటిలో ఇప్పుడు కూలీ కూడా చేరిపోయింది. ఈ వారం లో డీసెంట్ స్థాయి హోల్డ్ ని సొంతం చేసుకొని, రెండవ వీకెండ్ లో కూడా భారీ వసూళ్లను నమోదు చేసుకుంటే కచ్చితంగా ఈ చిత్రం ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుంది.
నేడు ఈ రెండు చిత్రాల పరిస్థితి ఎలా ఉందో చూస్తే, తెలుగు వెర్షన్ మొదటి రోజే పడిపోయింది, ఇక ఈరోజు ఏకంగా 90 శాతం వసూళ్లు డ్రాప్ అయ్యాయి, తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వెర్షన్ కి సంబంధించి ఇక గ్రాస్ వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో తెలుగు వెర్షన్ వసూళ్లకంటే హిందీ వెర్షన్ వసూళ్లే ఎక్కువ వస్తున్నాయి. తెలుగు వాళ్ళు కూడా హిందీ ఓ చూస్తున్నారో ఏమో తెలియదు కానీ, హీరో గా జూనియర్ ఎన్టీఆర్ కి మాత్రం ఇది అవమానకరమైనది అని చెప్పొచ్చు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 60 కోట్లు రాబట్టాలి, అది అసాధ్యమైన పని, మరో పక్క కూలీ చిత్రానికి కేవలం 8 కోట్ల రూపాయిల షేర్ వస్తే సరిపోతుంది, ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది.