Nagarjuna Career Analysis: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. పోటీ ఉన్నప్పుడే ది బెస్ట్ సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున సైతం కెరియర్ స్టార్టింగ్ నుంచి పలు వైవిధ్య భరితమైన సినిమాలను చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన తెలుగులో ఉన్న టాప్ 4 హీరోలలో ఒకరిగా ఎదిగాడు… శివ, నిన్నే పెళ్ళాడుతా, అన్నమయ్య లాంటి సినిమాలను మినహాయిస్తే మిగిలిన ప్రతిసారి చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ లతో పాటు పోటీపడే స్థాయి లో ఆయన సినిమాలను చేయలేకపోయాడు. కారణం ఏంటి అంటే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ లు డిఫరెంట్ గా ఉంటాయి.
Also Read: నాయకుడంటే ఇలానే ఉండాలనే రీతిలో లోకేష్.. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
అవి ప్రేక్షకుడు ఓన్ చేసుకోవడానికి సమయం పడుతుంది. అందువల్లే ఆయన కొంతవరకు ఫ్లాప్ లను మూటగట్టుకుంటుంటే మరికొన్ని సినిమాలు క్లాసిక్స్ గా నిలిపినప్పటికి రావాల్సిన ఆదరణ రాలేదు. ఇక సీనియర్ హీరోలందరిలో తన వెనుకబడిపోయాడు అంటూ చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున మాత్రం తన పంథాను మార్చుకోకుండా కొత్త దర్శకులు మంచి కంటెంట్ తో తన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసే సినిమాలు చేసిన ఘనత కూడా నాగార్జునకి దక్కుతుంది. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున ప్రస్తుతం తన వందో సినిమాని సైతం రా కార్తీక్ అనే ఒక తమిళ్ దర్శకుడికి అప్పజెప్పాడు. మరి ఆయన చేస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
నాగార్జున ఈ విషయంలో ఎప్పుడు రిగ్రేట్ అయితే అవ్వలేదంట. మిగతా హీరోతో తనకు పోటీ ఉండొచ్చు కానీ డిఫరెంట్ పాత్రలు చేసినప్పుడే ఒక నటుడి పొటెన్షియాలిటీ బయట పడుతుందని ఆయన నమ్ముతాడు అందుకే ఆయన హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా ముందుకు దూసుకెళ్తుంది…
