ANR Award : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి నటన అంటే ఏంటో పరిచయం చేసిన మహానుభావులు ఎన్టీఆర్ ఏఎన్నార్, ఎస్వీ రంగారావు వంటి వారు. వీళ్ళు లేనిదే తెలుగు సినిమా లేదు. కాళమ్మ తల్లికి వీళ్ళు చేసిన సేవలు వర్ణనాతీతం. నేడు అక్కినేని నాగేశ్వర రావు గారు జన్మించి 100 ఏళ్ళు పూర్తి అయ్యింది. ఆ మహానుభావుడి చరిత్ర నేటి తరం యువతకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కినేని నాగేశ్వర రావు గారు మనకి కేవలం ఒక హీరో గా మాత్రమే తెలుసు, కానీ ఆయన బాలనటుడిగా నటించాడని విషయం చాలా మందికి తెలియదు. 1941 వ సంవత్సరం లో ధర్మ పత్ని అనే చిత్రం ద్వారా నాగేశ్వర రావు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో ఒక పాట లో కనిపించే స్టూడెంట్స్ లో ఒకరిగా ఆయన కనిపిస్తాడు. ఆ తర్వాత ఆయన ‘శ్రీ సీత రామ జననం’ అనే చిత్రం ద్వారా తొలిసారిగా హీరో గా వెండితెర పై కనిపించాడు.
అలా మొదలైన నాగేశ్వర రావు సినీ ప్రయాణంలో భారత దేశం సినీ అభిమానులు చిత్రస్థాయిగా గుర్తించుకోదగ్గ ఎన్నో అద్భుతమైన సినిమాలు, పాత్రలు పోషించి జనాల గుండెల్లో అమరుడు అయ్యాడు. తన చివరి శ్వాస వదిలే వరకు సినిమాల్లో నటిస్తూ ఉండాలి అనేది ఆయన కోరిక. కళామ్మ తల్లి కి ఆయన చేసిన సేవలకు, దేవుడు ఆ కోరిక నెరవేర్చాడు. ఆయన చివరి సారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘మనం’. తన కుటుంబ సభ్యులందరితో కలిసి చివరి సినిమా చేసే అదృష్టం ఎంతమందికి కలుగుతుంది చెప్పండి. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యినప్పుడు, డబ్బింగ్ చెప్పే సమయంలోనే నాగేశ్వర రావు గారు అస్వస్థత పాలయ్యారు. బెడ్ మీద పడుకొనే ఆయన డబ్బింగ్ ని పూర్తి చేసాడు. దురదృష్టం ఏమిటంటే ఈ సినిమా విడుదలయ్యే లోపే ఆయన కన్ను మూసారు. అప్పటికి ఆయన వయస్సు 89 ఏళ్ళు. నాగేశ్వర రావు పేరు ని చిరస్థాయిగా గుర్తించుకోవాలనే తపనతో అక్కినేని నాగార్జున ఆయన పేరిట అవార్డ్స్ ని ఏర్పాటు చేసాడు.
ప్రతీ రెండేళ్లకు ప్రముఖ నటీనటులకు ఈ అవార్డ్స్ ని అందిస్తూ వచ్చారు. నేడు నాగేశ్వర రావు గారి వందవ పుట్టిన రోజు సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘నాన్న గారి పేరు మీద అవార్డ్స్ ని ఇవ్వడం ప్రతీ రెండేళ్లకు అయినా మేము చేస్తూండేవాళ్ళం. ఈ ఏడాది ఆ అవార్డు ని చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయం ఆయనకు చెప్పగానే ఎంతో సంతోషించారు. నన్ను హత్తుకొని, థాంక్యూ నాగ్, నాన్న గారి 100వ ఏటా నాకు ప్రత్యేకంగా ఈ అవార్డు ని ఇవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది, నాకు వచ్చిన అన్ని అవార్డ్స్ కంటే ఈ అవార్డు ఎంతో ప్రత్యేకం అని అన్నారు. అక్టోబర్ 28 న ఈ అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది. అమితాబ్ బచ్చన్ గారు చేతుల మీదుగా ఈ అవార్డుని చిరంజీవి గారికి అందించబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున.
The ANR National Award in his centenary birth year will be awarded to MEGASTAR @KChiruTweets Garu ✨
Superstar @SrBachchan Garu will present the award in a special event on October 28th ❤#ANR100 #CelebratingANR100 #ANRLivesOn #AnnapurnaStudios pic.twitter.com/3Ia7xWuoWh
— Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2024