IND vs BAN : చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో రిషబ్ పంత్ తనదైన స్టైల్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. చెన్నై మైదానం పౌలర్లకు అనుకూలంగా మారినప్పటికీ.. తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ మైదానంపై నిలదొక్కుకోవడం కష్టమైనప్పటికీ రిషబ్ పంత్ అటాకింగ్ ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో వేగంగా 39 రన్స్ చేశాడు. ధాటిగా ఆడే క్రమంలో ఔట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో ఆరు బౌండరీలున్నాయి. ఇక రెండవ ఇన్నింగ్స్ లో క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చి రాగానే బ్యాట్ తో తాండవం చేశాడు. ఆడుతోంది టెస్ట్ అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు. టి20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. వరుస బంతుల్లో 4,6 కొట్టాడు.. ఇందులో ఒక సిక్సర్ క్రీజ్ దాటి కొట్టాడు. అతడు అలా కొట్టగానే ఆ బంతి వేగంగా బౌలర్ తల మీది నుంచి వెళ్ళిపోయింది. బౌలర్ అప్రమత్తం కావడంతో ముప్పు తప్పింది. లేకుంటే అతడి తల పుచ్చకాయ లాగా పగిలిపోయేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. అప్పటికే రోహిత్ శర్మ (5), యశస్వి జైస్వాల్ (10), విరాట్ కోహ్లీ (17) అవుట్ అయినప్పటికీ.. రిషబ్ పంత్ ఏమాత్రం భయపడకుండా దూకుడుగా ఆడాడు. తన బ్యాటింగ్ స్టైల్ తో టీమిండియా ఆటగాళ్లను ఆశ్చర్యపరిచాడు..
వరుసగా రెండు బంతులను..
భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్ 21 ఓవర్ వేశాడు. ఈ సందర్భంగా చివరి రెండు బంతులను రిషబ్ పంత్ బౌండరీకి పంపించాడు. ఐదో బంతిని స్వీప్ షాట్ ఆడాడు. స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీ కొట్టాడు. తర్వాత బంతిని క్రీజ్ దాటి కొట్టాడు. బౌలర్ తల మీద నుంచి సిక్సర్ కొట్టాడు. బౌలర్ అప్రమత్తం కావడంతో ఇబ్బంది తప్పింది.. లేకుంటే అతడి తల పగిలిపోయేది. పంత్ కొట్టిన సిక్సర్ చూసి బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు. బంతి గాల్లో లేచి బౌండరీని దాటుతుండగా..అలా చూస్తుండి పోయారు.. పంత్ కొట్టిన సిక్సర్ చూసి నెటిజన్లు ప్రశంసల జలు కురిపిస్తున్నారు.. “బాబోయ్ అదేం షాట్ రా బాబూ.. అంతటి గుండె ధైర్యంతో ధాటిగా ఆడాలంటే మామూలు విషయం కాదని” కామెంట్స్ చేస్తున్నారు. “రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడని.. ఐపీఎల్ లో సూపర్ బ్యాటింగ్ తో అలరించాడని.. వచ్చే రోజుల్లో అతడు టీమ్ ఇండియాకు కెప్టెన్ అవుతాడని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు. రెండవ ఇన్నింగ్స్ లో పంత్ సెంచరీ చేయాలని కోరుతున్నారు.