Mathu Vadalara 2  Collections : మత్తు వదలరా 2 ‘ మొదటి వారం వసూళ్లు..ఇవేమి లాభాలు సామీ..స్టార్ హీరోలకు కూడా ఇలాంటి రికార్డు సాధ్యం కాదు!

కమెడియన్ సత్య చేసిన కామెడీ ఈ చిత్రానికి హైలైట్. అంత మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నప్పటికీ కూడా అందరూ థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత సత్య కామెడీ గురించే ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నారు అంటే, ఆయన ఏ రేంజ్ లో నటించాడో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో కచ్చితంగా ఆయన బ్రహ్మానందం రేంజ్ కి ఎదుగుతాడని ప్రశంసించారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదలై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది.

Written By: Vicky, Updated On : September 20, 2024 8:05 pm

Mathu Vadalara 2  Collections

Follow us on

Mathu Vadalara 2  Collections : రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న చిత్రం ‘మత్తు వదలరా 2’. మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రారంభ సన్నివేశం నుండి చివరి వరకు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. ముఖ్యంగా కమెడియన్ సత్య చేసిన కామెడీ ఈ చిత్రానికి హైలైట్. అంత మంది ఆర్టిస్టులు ఈ సినిమాలో ఉన్నప్పటికీ కూడా అందరూ థియేటర్ నుండి బయటకి వచ్చిన తర్వాత సత్య కామెడీ గురించే ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నారు అంటే, ఆయన ఏ రేంజ్ లో నటించాడో అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో కచ్చితంగా ఆయన బ్రహ్మానందం రేంజ్ కి ఎదుగుతాడని ప్రశంసించారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదలై అప్పుడే వారం రోజులు పూర్తి చేసుకుంది.

సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అవ్వడం తో ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 8 కోట్ల రూపాయలకు జరిగింది. రిస్క్ చేస్తున్నారేమో, డైరెక్టర్ గత చిత్రం ‘హ్యాపీ బర్త్డే’ పెద్ద ఫ్లాప్ అయ్యింది. కనీసం కోటి రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేదు. అలాంటి డైరెక్టర్ నుండి వస్తున్న తదుపరి చిత్రానికి 8 కోట్లు బిజినెస్ అంటే చిన్న విషయం కాదు అంటూ ట్రేడ్ పండితులు అనుమానించారు. కానీ ఈ చిత్రం ఓపెనింగ్స్ నుండే కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోయింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి కాసుల వర్షం కురుస్తోంది. ఇది ఇలా ఉండగా వారం రోజుల్లో ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.

ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి కేవలం ఓవర్సీస్ నుండి 3 కోట్ల 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అలాగే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 88 లక్షలు, మొత్తం మీద తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా బయట నుండి ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు. ఒక చిన్న సినిమాకి తెలుగు రాష్ట్రాలు దాటి ఇంత వసూళ్లు రావడం, అది కూడా మొదటి వారం లోనే అవ్వడం మామూలు విషయం కాదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 78 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 3 కోట్ల 42 లక్షలు రాబట్టినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ సినిమాకి మొదటి వారం లో 11 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ వీకెండ్ లో కొత్త సినిమాల విడుదల లేదు, దేవర చిత్రం వరకు ఈ సినిమా రన్ ఉంటుందని, మరో 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను ఫుల్ రన్ లో రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.