Nagachaitanya: అక్కినేని నాగచైతన్య హీరో గా నటించిన ‘కస్టడీ’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. మొదటిరోజు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి కనీసం రీసెంట్ డిజాస్టర్ ఫ్లాప్స్ కి వచ్చినంత వసూళ్లు కూడా రాకపోవడం ఆశ్చర్యార్ధకం. ఇప్పటికే నాగచైతన్య తమ్ముడు అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ సినిమా బయ్యర్స్ కి ఈ ఏడాదిలోనే భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఆ బాధ నుండి కోలుకోవడానికి కనీసం ఏడాదికి పైగా సమయం పడుతుంది.
ఇంతలోపే ‘కస్టడీ’ రూపం అదే కుటుంబానికి చెందిన నాగ చైతన్య బయ్యర్స్ పాలిట యముడిలాగా మారిపోయాడు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల రూపాయలకు జరగగా, మొదటి రోజు కేవలం కోటి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఫుల్ రన్ లో కనీసం ఏజెంట్ కి వచ్చినంత వసూళ్లు అయినా వస్తుందో లేదో అని బయ్యర్స్ ఆందోళన చెందుతుంటే, నాగ చైతన్య మాత్రం తన నిర్మాతల చేత నేడు హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని పెట్టించాడు.
సినిమా నిజంగా సక్సెస్ అయ్యిందా,చిత్రాన్ని కొన్న ప్రతీ ఒక్కరు సంతోషం గా ఉన్నారా లేదా అనేది నిర్మాతకి తెలుసు. హీరో కి కూడా ఈ విషయం తెలియకుండా ఉండదు. సక్సెస్ అయ్యినప్పుడు సంబరాలు చేసుకోవడం లో అర్థం ఉంది. కానీ ఇంత పెద్ద ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఈ సక్సెస్ మీట్ లు పెట్టడం ఏంటో అని అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఫ్లాప్ అయిన సినిమా మరింత నష్టపోవడానికి ఏ చిత్ర నిర్మాత కూడా ఒప్పుకోడు. అలాంటిది ఈ సక్సెస్ మీట్ ని నిర్మాత పెట్టాడంటే కచ్చితంగా నాగ చైతన్య చెప్పబట్టే అని అంటున్నారు నెటిజెన్స్.
మొదటి రోజు వసూళ్ల సంగతి కాసేపు పక్కన పెడితే రెండవ రోజు నుండి అయిన డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడితే ఈ సక్సెస్ మీట్ పెట్టడం లో ఒక అర్థం ఉంది.కానీ అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండవ రోజు కేవలం 70 లక్షల షేర్ వసూళ్లు మాత్రమేనట. ఇలాంటి ట్రెండ్ ఉన్నప్పుడు కూడా రెండు కోట్లు ఖర్చు చేసి సక్సెస్ మీట్ పెట్టించడం అనేది పైత్యానికి పరాకాష్ట అంటున్నారు ట్రేడ్ పండితులు.