Gopichand: ఊరమాస్ హీరోగా ఎదిగేందుకు అన్నీ రకాల అర్హతలు ఉన్నప్పటికీ,అదృష్టం కలిసి రాక ఇంకా మీడియం రేంజ్ హీరోగానే మిగిలిపోయిన నటుడు గోపీచంద్. ప్రముఖ దర్శకుడు టీ.కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన గోపీచంద్ తొలిసినిమా లో హీరోగానే నటించాడు. ఆ చిత్రం పేరు తొలివలపు.కమర్షియల్ గా అతి పెద్ద డిజాస్టర్ గా ఆ సినిమా మిగిలిపోవడం తో గోపీచంద్ ని హీరోగా పెట్టి సినిమాలు తీసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.
ఆ సమయం లో ఆయనకీ ‘జయం’ సినిమాలో విలన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వడం తో గోపీచంద్ కి ‘వర్షం’ మరియు ‘నిజం’ వంటి సినిమాల్లో కూడా విలన్ గా చేసే ఛాన్స్ దక్కింది. అన్నిట్లోనూ ఆయన నటనకి మంచి గుర్తింపు వచ్చింది, ఆ తర్వాత ‘యజ్ఞం’ సినిమాతో మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు.
హీరోగా వరుసగా ఆయనకీ ఎన్నో హిట్స్,సూపర్ హిట్స్ మరియు బ్లాక్ బస్టర్స్ కొడుతూ మంచి మాస్ హీరో అనిపించుకున్న గోపీచంద్ కి ఈమధ్య వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తున్నాయి. ఆయన మార్కెట్ ని పూర్తిగా దెబ్బతినేలా చేస్తున్నాయి. అయితే ఆయనకీ ఫ్లాప్స్ రావడానికి కారణం గడ్డమే అని అంటున్నారు నెటిజెన్స్. కొంతమంది హీరోలకు కొన్ని సెంటిమెంట్స్ ఫాలో అవుతుంటాయి. ఆ సెంటిమెంట్స్ ఒక్కోసారి మంచి చెయ్యొచ్చు, ఒక్కోసారి నష్టాలను కూడా తీసుకొని రావొచ్చు, గోపీచంద్ కి మాత్రం నష్టమే తీసుకొచ్చింది. ఆయన గడ్డం తో ఇప్పటి వరకు కనిపించిన ‘నిజం’ ‘రారాజు’ ‘ఒంటరి’ ‘గౌతమ్ నందా’ ‘పంతం’ మరియు ‘చాణక్య’ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
రీసెంట్ గా విడుదలైన ‘రామబాణం’ సినిమా లో కూడా ఆయన రెండు మూడు పాటల్లో గడ్డం తో కనిపిస్తాడు. అందుకే ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యిందని అంటున్నారు ఫ్యాన్స్. ఒక ‘సీటిమార్’ చిత్రం ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యిందని, అది కూడా గోపీచంద్ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడని హిట్ అని అంటున్నారు.