https://oktelugu.com/

Prabhas : ‘ఆదిపురుష్’ కి తీసుకున్న రెమ్యూనరేషన్ ని భద్రాచలం దేవాలయం కి విరాళం గా ఇచ్చేసిన ప్రభాస్

ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఈనెల నుండే ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ ప్రొమోషన్స్ సినిమాపై ఇంకెంత అంచనాలు పెంచుతుందో చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : May 14, 2023 / 08:47 AM IST
    Follow us on

    Prabhas : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో మామూలు రేంజ్ అంచనాలు లేవు అనే విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా  విడుదల చేసిన ట్రైలర్ ఈ చిత్రానికి పై ఆ రేంజ్ లో అంచనాలు పెంచేలా చేసింది. టీజర్ విడుదల సమయం లో వచ్చిన నెగటివ్ కామెంట్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎంతో జాగ్రత్తతో ఈ గ్రాఫిక్స్ పై మరోసారి రీ వర్క్ చేసారు.

    ఔట్పుట్ అద్భుతంగా వచ్చిందనే విషయం ట్రైలర్ ని చూస్తే అర్థం అయిపోతుంది. ఈ చిత్రాన్ని షూటింగ్ చెయ్యడానికి పట్టిన సమయం తక్కువే కానీ, గ్రాఫిక్స్ కోసం వెచ్చించిన సమయం చాలా ఎక్కువ.  ఎందుకంటే ఈ సినిమాలో వానర సైన్యాన్ని సరికొత్తగా చూపించేందుకు మోషన్ కాప్చర్ టెక్నాలజీ ని ఉపయోగించారు. అది చూసే ఆడియన్స్ సరికొత్త అనుభూతిని కలిగించింది.

    ఇక జూన్ 16 వ తేదీన విడుదల అవ్వబొయ్యే ఈ సినిమాని ఆడియన్స్ కి ఎలాంటి అనుభూతి కలిగించబోతుందో చూడాలి.ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ చిత్ర నిర్మాతలు ప్రభాస్ కి రెమ్యూనరేషన్ సెటిల్మెంట్ చేశారట. ప్రభాస్ ముందుగానే ఈ చిత్రానికి వచ్చిన డబ్బులలో కచ్చితంగా ‘భద్రాచలం’ లో ఉన్న శ్రీరాముని ఆలయానికి విరాళం ఇస్తానని మొక్కుకున్నాడట. ఆ మొక్కులో భాగంగానే రెమ్యూనరేషన్ చేతికి అందిన వెంటనే 10 లక్షల రూపాయిలు భద్రాచలం కి డొనేట్ చేసాడట.

    ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ఉన్నతమైన మనసుకి ఇది మరొక ఉదాహరణ అంటూ అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఆయనని ప్రశంసలతో ముంచి ఎత్తుతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఈనెల నుండే ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈ ప్రొమోషన్స్ సినిమాపై ఇంకెంత అంచనాలు పెంచుతుందో చూడాలి.