Homeఎంటర్టైన్మెంట్Nagababu: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన నాగ‌బాబు.. బోడిగుండు పోస్టుతో ఇలా చేశారేంటి

Nagababu: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన నాగ‌బాబు.. బోడిగుండు పోస్టుతో ఇలా చేశారేంటి

Nagababu:  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ వ‌చ్చిందంటేనే ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌స్తుంటాయి. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ప‌వ‌న్ భీమ్లానాయ‌క్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశాడు. మొద‌టి నుంచి ఈ మూవీ భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ హిట్ మూవీ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు రీమేక్ కావ‌డం, పైగా ఇందులో రానా లాంటి క్రేజీ హీరో విల‌న్‌గా న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి. ఇక మూవీ సాంగ్స్ అయితే కావాల్సినంత హైప్‌ను తీసుకు వ‌చ్చాయి. టీజ‌ర్‌, […]

Nagababu:  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ వ‌చ్చిందంటేనే ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌స్తుంటాయి. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ప‌వ‌న్ భీమ్లానాయ‌క్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేశాడు. మొద‌టి నుంచి ఈ మూవీ భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ హిట్ మూవీ అయిన అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌కు రీమేక్ కావ‌డం, పైగా ఇందులో రానా లాంటి క్రేజీ హీరో విల‌న్‌గా న‌టిస్తుండ‌టంతో అంచ‌నాలు ఆకాశాన్ని అంటాయి.

Nagababu
Nagababu Interesting Comments

ఇక మూవీ సాంగ్స్ అయితే కావాల్సినంత హైప్‌ను తీసుకు వ‌చ్చాయి. టీజ‌ర్‌, ట్రైల‌ర్లు, పోస్ట‌ర్ల‌తో ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేశారు మూవీ మేక‌ర్స్‌. అంద‌రూ ఊహించిన‌ట్టు గానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జ‌రిగింది. యంగ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కే చంద్ర డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీ వెన‌క అన్నీ తానై త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ న‌డిపించారు. ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ‌ట్టు క‌థ‌లో మార్పులు చేయించి, డైలాగుల‌ను అందించారు.

Also Read:  రివ్యూ : ‘భీమ్లా నాయక్’ హిట్టా ? ఫట్టా ?

ఇప్ప‌టికే అన్ని ఏరియాల్లో క‌లిపి ఈ మూవీకి ఏకంగా రూ.106.75 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఈ రోజు ఉద‌య‌మే రిలీజ్ అయిన ఈ మూవీ హిట్ టాక్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌న్ ప‌వ‌ర్ ఫ్యాక్ట‌ర్‌గా వ‌చ్చిన ఈ మూవీ.. అభిమానులు కోరుకున్న‌ట్టే ఉందంటున్నారు. అయితే మొద‌టి నుంచి ఈ మూవీ టికెట్ల కోసం విప‌రీతంగా పోటీ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. దాదాపు వ‌న్ వీక్ వ‌ర‌కు టికెట్లు ముందే బుక్ అయిపోవ‌డంతో.. మిగ‌తా వారికి అస్స‌లు మూవీ టికెట్లు దొర‌క‌ట్లేదు.

Nagababu
Nagababu

ఈ నేప‌థ్యంలో మెగా బ్ర‌ద‌ర్ చేసిన పోస్టు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇచ్చేసింది. చాలామంది నాగ‌బాబుకు భీమ్లానాయ‌క్ టికెట్ల కోసం ఫోన్లు చేస్తున్నారంట‌. టికెట్లు ఇప్పించాలంటూ విజ్ఞ‌ప్తి చేస్తున్నారంట‌. దీంతో ఆయ‌న త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేశారు. విక్రమార్కుడు మూవీలో అంద‌రికీ గుండు కొట్టి మోసం చేశార‌ని ఎమ్మెల్యే ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. ఆ ఎమ్మెల్యే భార్యుకు కూడా గుండు కొట్టిన సీన్‌ను ఆయ‌న పంచుకున్నారు. అంటే త‌న‌ను టికెట్లు అడిగితే.. త‌న‌కే టికెట్ల కొర‌త ఉన్న‌ట్టు ఆయ‌న ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నార‌న్న మాట‌. ఈ పోస్టును ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.

Also Read: అఖండ వర్సెస్ భీమ్లానాయక్: రికార్డుల మోత.. కలెక్షన్ కింగ్ ఎవరు?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Oktelugu Epaper