Karimnagar Police Commissioner: గబ్బర్ సింగ్ సినిమాలో “దేఖో దేఖో గబ్బర్ సింగ్.. ఆల్ ఇండియా కి హైపర్ కింగ్” అనే పాట ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ సినిమా విజయవంతం కావడం లో ఈ పాట ముఖ్యపాత్ర పోషించింది. గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన తర్వాత ఒక ఏడాది పాటు ఈ పాట ఎక్కడా చూసినా వినిపించేది. ముఖ్యంగా యువత ఈ పాటకు చిందులు వేసేవారు.. అయితే ఇప్పుడు ఈ పాట పోలీస్ శాఖను ఊపేసింది.
Also Read: నా భార్య బ్రాహ్మణి నుంచి అది నేను నేర్చుకోవాలి.. నారా లోకేష్
21 ఐపీఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ చీఫ్ సెక్రటరీ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. బదిలీ అయిన వారిలో ఒక అదనపు డీజీ , ఇద్దరు ఐజీలు ఉన్నారు. ఇద్దరు డీఐజీలు, 14 మంది ఐపీఎస్ లు, ఇద్దరు నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. అయితే ఈసారి చీఫ్ సెక్రటరీ ఐపీఎస్ అధికారుల పనితీరు ఆధారంగా ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పనిభారంతో సతమతమవుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు కూడా సిఎస్ ఊరట కలిగించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ భగవత్ అదనపు డిజి పర్సనల్, లా అండ్ ఆర్డర్ ను పర్యవేక్షిస్తున్నార అయితే ఆయనపై ప్రభుత్వం పని భారం తగ్గించింది. అదనపు డీజీ పర్సనల్ గా అనిల్ కుమార్ ను నియమించింది. అనిల్ కుమార్ ప్రస్తుతం ఎస్పీఎఫ్ డీజీ గా కొనసాగుతున్నారు. అయితే తదుపరి ఉత్తరాలు వచ్చేవరకు ఆయన ఎస్పీఎఫ్ బాధ్యతలు పర్యవేక్షిస్తారు.
గబ్బర్ సింగ్ పాటతో..
చీఫ్ సెక్రటరీ తీసుకుని నిర్ణయంతో కరీంనగర్ సీపీగా పనిచేసిన అభిషేక్ మహంతి బదిలీపై వెళ్తున్నారు. ఇన్ని రోజులపాటు కరీంనగర్ జిల్లాకు ఆయన అందించిన సేవలకు గానూ సహచర పోలీసులు ఘనంగా సెండాఫ్ ఇచ్చారు. ” దేఖో దేఖో గబ్బర్ సింగ్” అనే పాటకు అందరూ కలిసి డ్యాన్సులు వేశారు. అభిషేక్ మహంతిని భుజాలపైకి ఎత్తుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. భుజాలపై మోస్తూ.. పాటకు స్టెప్పులు వేస్తూ.. సందడి చేశారు. సహచర పోలీసుల ఆనందాన్ని కాదనలేక అభిషేక్ మహంతి కూడా వారితో కలిసి నవ్వులు చిందించారు. తనను భుజాలకు ఎత్తుకుంటున్నప్పుడు వద్దని వారించారు. తీవ్ర ఒత్తిడితో కూడుకుని ఉండే పోలీసులు.. ఎన్ని సంవత్సరాలు పాటు తమకు బాస్ లా వ్యవహరించిన అభిషేక్ మహంతి సెండాఫ్ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో కరీంనగర్ పోలీస్ గ్రూపులలో తెగ సందడి చేస్తోంది. కరీంనగర్ సీపీగా పని చేసిన అభిషేక్ మహంతి ఉన్నన్ని రోజులు నిక్కచ్చిగా వ్యవహరించారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో తనదైన మార్క్ ప్రదర్శించారు. ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టారు. భూ దందాలు, కబ్జాలు జరగకుండా ఉక్కు పాదం మోపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేశారు. అందువల్లే అభిషేక్ మహంతి సూపర్ కాప్ గా కరీంనగర్ జిల్లా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా అభిషేక్ మహంతి పనిచేసి బదిలీపై వెళ్తున్న సందర్భంగా.. సహచర పోలీసులు ఘనంగా సెండాఫ్ ఇచ్చారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాలోని దేఖో దేఖో అనే పాటకు పోలీసులు స్టెప్పులు వేశారు. #GabbarSingh #DekhoDekhoGabbarsingh #PawanKalyan #HarishShankar pic.twitter.com/3h17U7KCqJ
— Anabothula Bhaskar (@AnabothulaB) March 8, 2025