Nagababu On Niharika Second Marriage: మెగా బ్రదర్ నాగబాబు(Nagababu Konidela) తన ఒక్కగానొక్క కుమార్తె నిహారిక(Niharika Konidela) పెళ్లి ని చైతన్య అనే వ్యక్తితో ఎంత గ్రాండ్ గా నిర్వహించిన సంగతి మన అందరికీ తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయ్ ఘడ్ కోటాలో ఔరా అనిపించే విధంగా ఈ వివాహ మహోత్సవాన్ని జరిపించాడు. గడిచిన దశాబ్ద కాలంలో ఇంత అట్టహాసంగా ఒక సెలబ్రిటీ పెళ్లి జరగడం ఇప్పటి వరకు మనం చూడలేదు. అలాంటి వివాహం చేసుకొని నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ గా నిల్చిన ఈ జంట విడిపోవడం పెద్ద సంచలనం గా మారింది. ఈ జంటకు సంబంధించిన ఫోటోలు చూస్తే వీళ్ళ మధ్య చాలా అన్యోయమైన బంధం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కానీ కొన్ని అపోహలు, మనస్పర్థలు కారణంగా వీళ్ళు విడిపోవాల్సి వచ్చింది. దీనిపై నిహారిక కానీ, నాగబాబు కానీ నిన్న మొన్నటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
Also Read: విజయ్ దేవరకొండ పై కేసు నమోదు.. క్షమాపణలు వృధా అయ్యినట్టేనా!
కానీ, రీసెంట్ గా ఫాథర్స్ డే సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు నిహారిక గురించి మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నిహారిక పెళ్లి విషయం లో నేను చాలా తొందరపడ్డాను. కాస్త అలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది. ఈ విషయం లో ఒక తండ్రిగా నేను విఫలం అయ్యాను. విడాకులు తర్వాత అమ్మాయి చాలా మానసిక ఒత్తిడి ని ఎదురుకుంది. ఇప్పుడిప్పుడే దాని నుండి మెల్లగా కోలుకుంటుంది. కచ్చితంగా ఆమె కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు. ప్రస్తుతం అమ్మాయి కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈమధ్యనే ‘కమిటీ కుర్రాళ్ళు’ చిత్రంతో మంచి సూపర్ హిట్ ని అందుకుంది. అయితే ఒక మనిషికి కచ్చితంగా జీవితాంతం తోడు ఉండే వాళ్ళు కావాలి. కచ్చితంగా నిహారికకు తగిన సంబంధం చూసి పెళ్లి చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు. ఆయన మాట్లాడిన ఈ మాటలు చర్చేనీయాంసంగా మారాయి.
ఇకపోతే రీసెంట్ గానే నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్(Varun Tej) పెళ్లి ని ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తో ఎంత ఘనంగా నిర్వహించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు లావణ్య త్రిపాఠి గర్భం దాల్చింది. త్వరలోనే నాగబాబు కుటుంబం లో ఒక కొత్త సభ్యుడు/సభ్యురాలు అడుగుపెట్టంబోతున్నారు. ఇలా నాగబాబు కుటుంబం ప్రస్తుతం ఎంతో మంచి పీక్ పీరియడ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక కెరీర్ పరంగా నాగబాబు ఇప్పుడు ఎంతటి ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాడో తెలిసిందే. జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేసినందుకు ఆయనకు పవన్ కళ్యాణ్ MLC పదవి ని ఇప్పించాడు. త్వరలోనే మంత్రి వర్గంలోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. ఇది నాగబాబు ప్రతిష్టని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్లే విషయం. చూడాలి మరి ఒక మంత్రిగా నాగబాబు ఎలా పని చేస్తాడు, ఏ స్థాయికి వెళ్తాడు అనేది.
Also Read: శేఖర్ కమ్ములను మన హీరోలు తక్కువ అంచనా వేశారా..?