Homeఎంటర్టైన్మెంట్Vijay Devarakonda Police Case: విజయ్ దేవరకొండ పై కేసు నమోదు.. క్షమాపణలు వృధా అయ్యినట్టేనా!

Vijay Devarakonda Police Case: విజయ్ దేవరకొండ పై కేసు నమోదు.. క్షమాపణలు వృధా అయ్యినట్టేనా!

Vijay Devarakonda Police Case: తమిళ హీరో సూర్య(Suriya Sivakumar) నటించిన ‘రెట్రో'(Retro Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. గిరిజన సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. క్షమాపణలు చెప్పాలి, చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశాయి. విజయ్ దేవరకొండ కూడా వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పి,తానూ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడాడో కూడా చెప్పుకొచ్చాడు. అక్కడితో మ్యాటర్ మొత్తం సెటిల్ అయిపోయింది. ఇక గొడవలు ఉండవని అంతా అనుకున్నారు. కానీ గిరిజన సంఘాలు శాంతించలేదు. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ లో రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఎస్సీ, ఎస్టీ కేసు ని నమోదు చేసారు. పోలీసులు ఈ కేసు పై దర్యాప్తు మొదలు పెట్టారు. దీనిపై విజయ్ దేవరకొండ ఏమని సమాధానం చెప్తాడో చూడాలి. పోలీసులు విచారణకు పిలిస్తే కచ్చితంగా హాజరు అవ్వాల్సిందే.

Also Read: మహేష్ బాబు చేసిన ఆ సూపర్ హిట్ సినిమాలో వాళ్ల అక్క మంజుల నటించాల్సిందా.?

బహుశా విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పిన విషయం వీళ్లకు తెలియక ఈ కేసుని నమోదు చేశారా?, లేకపోతే తెలిసే చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ కేసు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్లకు తెలియకపోయినా కూడా, పోలీసులకు తెలుసు కదా?, కానీ వాళ్ళు ఎందుకు కేసు ని నమోదు చేశారు అనే ప్రశ్నలు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుండి వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే ఆయన హీరో గా నటించిన ‘కింగ్డమ్’ చిత్రం విడుదల కాబోతుంది. ఇలాంటి సమయంలో ఈ వివాదం లో విజయ్ దేవరకొండ చిక్కుకోవడం ఆ సినిమాపై ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో చూడాలి. కెరీర్ పరంగా విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఎంతో గడ్డు పరిస్థితిని ఎదురుకుంటున్నాడు. ‘గీత గోవిందం’ తర్వాత ఈ హీరో చేసిన సినిమాలు దాదాపుగా అన్నీ ఫ్లాప్ అయ్యాయి. మధ్యలో ఒకటి రెండు యావరేజ్ సినిమాలు వచ్చాయి. ఆయన గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ అయితే కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.

ఇప్పుడు కింగ్డమ్ చిత్రం మీదనే ఆయన కోటి ఆశలు పెట్టుకున్నాడు. ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలో ఇలాంటి కేసు చిక్కుకోవడం పెద్ద తలనొప్పి విషయమే. ఎస్సీ, ఎస్టీ కేసు చిన్నది కాదు, చాలా సమస్యల్లో చిక్కుకునే కేసు ఇది. దీని నుండి విజయ్ దేవరకొండ ఎలా బయటపడుతాడో చూడాలి. ఇంతకు విజయ్ దేవరకొండ ‘రెట్రో’ ఈవెంట్ లో ఏమన్నాడంటే, వేళా ఏళ్ళ క్రితం ట్రైబల్ జనాలు కొట్టుకునే విధంగా ఇప్పటికీ చంపుకోవడం ఏమిటి?, వాళ్లకి విద్య లేకపోవడం వల్లే ఇలా తయారయ్యారు అంటూ చెప్పుకొచ్చాడు. అనంతరం గిరిజనులు నిరసన తెలపడం తో ‘నాకు గిరిజనులను కించపరిచే విధంగా మాట్లాడాలనే ఉద్దేశ్యం అసలు లేదు. అంతా నా అన్నదమ్ములే. నేను ప్రపంచం లో నాగరికత మొదలు అవ్వనప్పుడు మనుషులు ఆదివాసులు లెక్కనే ఉండేవారు. అప్పట్లో మంచి చెడు అనేది తెలిసేది కాదు. ఆ ఉద్దేశ్యంతో అన్నాను..ఎవరైనా నొచ్చుకొని ఉండుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular