Today June 23 2025 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు అధిక ప్రయోజనాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు కుటుంబ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఏ రోజు ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ముందుకు వస్తారు. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించాలి. పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఉద్యోగులు ఒత్తిడికి లోను కావద్దు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. కుటుంబ సంబంధాల విషయంలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. సోమరితనం కాకుండా అనుకున్న పనిని పూర్తి చేయడానికి నిరంతరం కష్టపడుతూ ఉండాలి.
Also Read: గరుడ పురాణం: చనిపోయిన వ్యక్తికి సాయంత్రం అంత్యక్రియలు ఎందుకు నిర్వహించరు?
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. చేసే పని పై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొందరి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు మీ రాశి వారు కాస్త మానసికంగా ఆందోళనతో ఉంటారు. అయితే స్నేహితుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగాలు ఉత్పన్నమవుతాయి. కొందరు ఈ రాశి వారు చేసే పనుల పట్ల హేళన చేస్తారు. అయినా భయపడకుండా వెనుకడుగు వేయొద్దు. దూరప్రాయణాలు చేయాల్సి వస్తుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. విదేశాలనుంచి శుభవార్తలు వింటారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు వారు ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. అయితే ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. అనవసరపు ఖర్చులను నియంత్రిస్తారు. దీంతో ఆదాయం పెరుగుతుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొందరు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం ఉంటుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఇప్పటివరకు జరిగిన నష్టాల నుంచి బయటపడే మార్గాన్ని వెతుక్కుంటారు. ఉద్యోగులు కంపెనీలు మారే అవకాశం ఉంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. వ్యాపారులు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య వివాహానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం గడుపుతారు. ప్రియమైన వారితో దూర ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు కీలక ఒప్పందాలను చేసుకుంటారు. విదేశీ ప్రయాణాలకు సిద్ధమవుతారు. ఉన్నత చదువుల కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు అనవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు. పెట్టుబడుల సమయంలో పెద్దల ఆశీస్సులు ఉండాలి. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంట్లో ఏదైనా వివాదం ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి. దూర ప్రయాణాలు చేయడం మానుకోవడమే మంచిది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు చురుగ్గా పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారులకు అధిక ప్రయోజనాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేస్తారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన వెంటనే పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులకు అనుకూలమైన బదిలీలు ఉంటాయి. ఉన్నతాధికారుల ఎండలో ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. గతంలో అనారోగ్యంతో ఉంటే నేటితో ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు చేసేవారు ఆలోచించాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు తమ ప్రతిభతో అధికారులను ఆకట్టుకుంటారు. దీంతో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు అధికమైన లాభాలు రావచ్చు. విదేశాల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు నిరుత్సాహంగా ఉంటారు. వ్యక్తిగత జీవితం ప్రతికూలంగా మారుతుంది. ఓ సమాచారం ఆందోళనను కలిగిస్తుంది. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడమే మంచిది.