Kuberaa Success Meet: భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలైన ‘కుబేర'(Kubera Movie) చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ సొంతం అవ్వడం తో బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి వసూళ్లు వస్తున్నాయో మన అందరికీ తెలిసిందే. చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక డీలాపడిన టాలీవుడ్ కి ఈ చిత్రం ఇచ్చిన కిక్ సాధారణమైనది కాదు. అటు ధనుష్(Dhanush) అభిమానులు కానీ, ఇటు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) అభిమానులు కానీ, తమ అభిమాన హీరోల గురించి ఫ్యాన్స్ ఎంతో గర్వంగా చెప్పుకునే రేంజ్ పెర్ఫార్మన్స్ ని డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఈ చిత్రం ద్వారా రాబట్టుకున్నాడు. సినిమా ఇంత పెద్ద సూపర్ హిట్ అయిన సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ సక్సెస్ మీట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు.
Also Read: నిహారిక 2వ పెళ్లిపై మెగా బ్రదర్ నాగబాబు సంచలన ప్రకటన..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!
ఈ ఈవెంట్ లో ఆయన సినిమా గురించి,సినిమా లో పని చేసిన నటీనటుల గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి ముఖ్య అతిథిగా వస్తుండడంతో చెన్నై నుండి హీరో ధనుష్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నాడు. లోపలకు రాగానే ముందుగా ఆయన అందరికి కరచాలనం చేస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చాడో ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇది ఈ ఈవెంట్ లో బాగా హైలైట్ అయ్యింది. చిరంజీవి కూడా ధనుష్ ని ఎంతో ఆప్యాయంగా హత్తుకున్నాడు. అద్భుతంగా నటించావు అంటూ ఆయన్ని పొగడ్తల వర్షం లో ముంచి ఎత్తాడు. జాతీయ స్థాయిలో నాలుగు సార్లు ఉత్తమనటుడి క్యాటగిరీలో నేషనల్ అవార్డుని అందుకున్న ధనుష్ ఇలా ఎంతో డౌన్ టు ఎర్త్ గా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
చిరంజీవి కి ధనుష్ ఇచ్చిన గౌరవం ఎంతో బాగుంది కానీ, ఎందుకో ధనుష్ తన ప్రసంగం లో అక్కినేని నాగార్జున గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిరంజీవి గురించి మాట్లాడుతూ ‘ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఓం అనే రాసి ప్రారంభిస్తూ ఉంటాము. ఆ ఓం స్థానం లో మీరు ఉన్నారు సార్. మీ లాంటి గొప్ప మనిషి ఇక్కడికి రావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. చిన్నప్పటి నుండి మిమ్మల్ని, మీ సినిమాల్ని చూస్తూ పెరిగాను. మీ నుండి నిల్చొని ఇలా మాట్లాడడం నేను చేసుకున్న అదృష్టం’ అంటూ ధనుష్ మాట్లాడిన మాటలు మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రసంగం తర్వాత చివర్లో మరోసారి ఆయన పాదాలకు ధనుష్ నమస్కరించడం మరో హైలైట్ గా నిల్చింది. ఇలా ఈ ఈవెంట్ చూస్తున్నంతసేపు అభిమానులకు మనసులో ఎంతో ఆనందాన్ని కలిగించింది.
Also Read: శేఖర్ కమ్ములను మన హీరోలు తక్కువ అంచనా వేశారా..?