Nagababau Sentional Comments on CM Jagan: ‘భీమ్లానాయక్’ సినిమా విషయంలో జగన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాగా కృష్ణా జిల్లా గుడివాడలోని జీ3 భాస్కర్ థియేటర్‌కు రూ.50,000 జరిమానా విధించారు. భీమ్లానాయక్ టికెట్లను అధిక రేట్లకు అమ్ముతున్నారని ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేసి, ఫైన్ వేశామని అధికారులు తెలిపారు.
కాగా డైమండ్ కేటగిరీ టికెట్ రేట్ రూ.70 కాగా రూ.100కు అమ్ముతున్నారని, కొన్ని టికెట్లపై ధర కూడా ముద్రించలేదని చెప్పారు. అయితే , ఈ థియేటర్‌ను మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని శుక్రవారం ప్రారంభించారు. మొత్తానికి ‘భీమ్లానాయక్’ థియటర్స్ పై ప్రభుత్వం కావాలని ఇలా చేస్తోంది అని అభిమానులు ఆరోపిస్తున్నారు.
Also Read: డేనియల్ శేఖర్ భార్య ఎవరో తెలుసా?
ఇక నాగబాబు కూడా ఇదే విషయం పై మాట్లాడుతూ జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై మెగాబ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు సినిమాలను ఆంధ్రాలో బ్యాన్ చేయండి. మాకేం నష్టం లేదు. కొన్ని రోజులు నష్టపోయినా యూట్యూబ్, OTT, డిజిటల్ మీడియా ద్వారా మాకు డబ్బులొస్తాయి.
ఆంధ్రాలో హాలీవుడ్ సినిమాలను రూ.10కి చూపించగలరా? చిరంజీవి గారు సీఎంతో మాట్లాడినా ఎందుకు జీవో ఇవ్వలేదు, మా ఆర్థిక మూలాలను కొట్టాలని చూస్తున్నారు. అలా జరగదు’ అని చెప్పారు. మరి జగన్ ప్రభుత్వం టికెట్ రేట్లు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే, జగన్ ఈ సారి కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఇక తగ్గదే లే అని హీరోలు నిర్ణయించుకునే అవకాశం ఉంది.
Also Read: బాక్సాఫీస్ బద్దలు.. భీమ్లానాయక్ 4వ రోజు కలెక్షన్స్ షాకింగ్