Homeఎంటర్టైన్మెంట్Telugu Movies Released in March First Week: మార్చి మొద‌టి వారంలో సంద‌డి చేయ‌నున్న‌...

Telugu Movies Released in March First Week: మార్చి మొద‌టి వారంలో సంద‌డి చేయ‌నున్న‌ సినిమాలు ఇవే

Telugu Movies Released in March First Week: క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌డంతో మ‌ళ్లీ సినిమాల జాత‌ర షురూ కాబోతోంది. పుష్ప త‌ర్వాత రెండు నెల‌ల గ్యాప్ తీసుకుని బాక్సాఫీస్‌కు మునుప‌టి క‌ల తీసుకు వ‌చ్చాడు భీమ్లానాయ‌క్‌. దీంతో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. భీమ్లానాయ‌క్ ఇచ్చిన ధైర్యంతో మార్చి మొద‌టి వారంలో చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇటు థియేట‌ర్ల‌లో కొన్ని మూవీలు అలాగే ఓటీటీలో మ‌రికొన్ని సినిమాలు వ‌స్తున్నాయి.

థియేట‌ర్ల‌కు వ‌చ్చే సరికి దుల్క‌ర్ సల్మాన్‌, కాజ‌ల్ న‌టించిన హే సినామిక మూవీ మార్చి 3న విడుద‌ల కాబోతోంది. బృందా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక మార్చి 4న శ‌ర్వానంద్‌, ర‌ష్మిక యాక్ట్ చేసిన ఆడాళ్లు మీకు జోహార్లు మూవీ విడుద‌ల కాబోతోంది. ఇందులో సీనియ‌ర్ హీరోయిన్లు కుష్బూ, రాధిక‌, ఊర్వ‌శి న‌టించారు. కిషోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్ వ‌హించిన ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Telugu Movies Released in March
adavallu meku joharlu new poster

ఇక ఇదే రోజున వ‌రుస స‌క్సెస్ ల‌తో జోష్ మీద ఉన్న యంగ్ మీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టిస్తున్న సెబాస్టియ‌న్ పీసీ 524 సినిమా విడుద‌ల అవుతోంది. కోమ‌లి ప్ర‌సాద్‌, సువేక్ష ఇందులో న‌టించారు. దీనికి బాలాజీ డైరెక్ష‌న్ చేశారు. ఇక ఓటీటీ విష‌యానికి వ‌స్తే యూత్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న డీజీ టిల్లు ఆహా వేదిక‌గా మార్చి 4న స్ట్రీమింగ్ కాబోతోంది.

Also Read:  పెద్ద హీరోలు నోరు ఎత్తలేకపోయినా ప్రకాష్ రాజ్ తన గళమెత్తాడు !

 

Kiran Abbavaram
Kiran Abbavaram

 

ఇక మాస్ హీరో విశాల్, డింపుల్ హ‌య‌తీ న‌టించిన సామాన్యుడు మూవీ థియేట‌ర్ల‌లో సూప‌ర్ హిట్ తెచ్చుకుంది. ఈ సినిమాను జీ5 వేదిక‌గా మార్చి 4న విడుద‌ల చేయ‌బోతున్నారు. దీంతో పాటు మార్చి 2న ఎగైన్స్ ద ఐస్‌, మార్చి 3న ద వీకెండ్ ఎ వే, మార్చి 4న నో టైమ్ టుడే, పీసెస్ ఆఫ్ హ‌ర్ లాంటి హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కాబోతున‌నాయి. ఇక హిందీ వెబ్ సిరీస్ లు అయిన అన్ దేఖీ, వాండ‌ర్ ల‌స్ట్ లాంటి సిరీస్‌లు కూడా మార్చి4నే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

Also Read:  పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్.. భీమ్లానాయక్ అట్టర్ ఫ్లాప్ అట !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Upcoming Telugu Movies On OTT: నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అసలు ఈ కరోనా కాలంలో సినిమా రంగానికి ఏకైక ఆశా కిరణం నిలిచింది కూడా ఓటీటీలే. కరోనా క్లిష్ట స‌మ‌యంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. […]

Comments are closed.

Exit mobile version