Telugu Indian idol: కొత్త ఒక వింత.. పాత ఒక రోత అంటారు. ఏదైనా కొత్తదనంలో ఓ ఊపు ఉంటుంది. అయితే దాన్ని ఇప్పటి జనాలు ‘ట్రెండ్’ అని అంటున్నారు. ట్రెండ్ సెట్ చేయడంలో తప్పు లేదు. కానీ అది సూట్ అయ్యిందా? లేదా? అన్నది చూసుకోవాలి. తాజాగా ‘ఇండియన్ ఐడల్’ వేదికపై చిరిగిన దుస్తులతో వచ్చిన హోస్ట్, గాయకుడు శ్రీరామచంద్రకు ఇలానే పంచులు పడ్డాయి.. అది ట్రెండ్ అని ఆయన అనుకున్నాడు కానీ జడ్జీలు మాత్రం చిరిగిన దుస్తులను కామెడీ చేశారు.
ఓటీటీలు వచ్చాక వినోదం కాస్త ఎక్కువైంది. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు సంస్థలు కొత్త కొత్త షోలను, టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే జాతీయస్థాయిలో పాపులర్ అయిన ‘ఇండియన్ ఐడల్’ ఇప్పుడు తెలుగునాటకు వచ్చేసింది. ‘ఆహా’ ఓటీటీలో ప్రతీ వారం ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి.
Also Read: డేనియల్ శేఖర్ భార్య ఎవరో తెలుసా?
తెలుగు ఇండియన్ ఐడల్ కు జడ్జీలుగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్, నిత్యామీనన్, కార్తీక్ లు వ్యవహరిస్తున్నారు. దీనికి హోస్ట్ గా ఇండియన్ ఐడల్ శ్రీరామ చంద్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైన తెలుగు సింగర్లను పరిచయం చేస్తూ ఇదో పాటల పూదోటగా కార్యక్రమం మారిపోయింది. వినసొంపైన పాటలు.. గాయకుల గానమాధుర్యానికి జడ్జీలు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
సినిమా పాటలకు మించి ఈ గాయకులు పాడుతున్న పాటలకు తమన్, నిత్యామీనన్, కార్తీక్ లు అబ్బుపరుడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమం ప్రసారమైంది.. పాటలే కాదు.. అందులోని కామెడీ కూడా అలరించింది. హోస్ట్ శ్రీరామ చంద్రను పట్టుకొని ‘చిరిగిపోయిన డ్రెస్ లే వేసుకొస్తావ్ నీ ప్రాబ్లం ఏంటి?’ అని సంగీత దర్శకుడు తమన్ సెటైర్ వేశారు. బయట యేనా? లోపల కూడా చిరిగిపోయినవి వేసుకుంటావా? డిజైనర్ ఎవరు? ఆయనది చిరిగే ఉందా? అని కామెంట్ చేశాడు.
దీనికి అంతే హాస్యాస్పదంగా శ్రీరామచంద్ర స్పందించారు. ‘డిజైనర్ కు డబ్బులు తక్కువగా ఇచ్చారని చింపి ఇచ్చారన్నా’ అంటూ తమన్ కు జవాబిచ్చారు. ఇలా పాటలతో అలరించడమే కాదు.. మధ్య మధ్యలో కామెడీతో కూడా ఈ షో అలరిస్తుంది.
ఇక ఈ ప్రోగ్రాం చివరలో ‘ఇండియన్ ఐడల్’ వేదికపై అల్లు అర్జున్ మాస్క్ తో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు. ఆ మాస్క్ వెనుకాల ఉన్నది అల్లు అర్జున్ నా కాదా? అన్నది తేలాల్సి ఉంది.
Also Read: బాక్సాఫీస్ బద్దలు.. భీమ్లానాయక్ 4వ రోజు కలెక్షన్స్ షాకింగ్