Homeఎంటర్టైన్మెంట్Nagababu fire on Janasena leaders: మీకు కొంచమైనా బుద్ధి ఉందా అంటూ జనసేన నాయకులపై...

Nagababu fire on Janasena leaders: మీకు కొంచమైనా బుద్ధి ఉందా అంటూ జనసేన నాయకులపై నాగబాబు ఫైర్.. వీడియో వైరల్..

Nagababu fire on Janasena leaders: రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య జరిగిన గొడవ నేషనల్ వైడ్ గా ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ పై , మరో మాజీ ఎమ్మెల్యే , జనసేన పార్టీ నేత పెందెం దొరబాబు దాడి చేసేందుకు ప్రయత్నించడం పెద్ద […]

Nagababu fire on Janasena leaders: రీసెంట్ గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య జరిగిన గొడవ నేషనల్ వైడ్ గా ఎంతటి దుమారం రేపిందో మన అందరికీ తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ పై , మరో మాజీ ఎమ్మెల్యే , జనసేన పార్టీ నేత పెందెం దొరబాబు దాడి చేసేందుకు ప్రయత్నించడం పెద్ద దుమారానికి దారి తీసింది. ఈ అంశం లో వర్మ దే తప్పు అని సీఎం చంద్రబాబు సైతం అభిప్రాయపడడం , ఆయన్ని మందలించడం వంటివి జరిగాయి. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు , ప్రోటోకాల్ లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోని ఒక ఫ్లెక్సీ లో చేర్చకపోవడం పై వర్మ మరియు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున రచ్చ చేశారు. అందుకు జనసేన కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడం వల్లే ఇంత పెద్ద వివాదంగా మారింది.

అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం నియోజగవర్గానికి చేరుకొని జనసేన నాయకులతో కీలక సమావేశం ఏర్పాటు చేశాడు . పిఠాపురం లో సమస్యలపై , అదే విధంగా పార్టీ లో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసాడు. ఈ కార్యక్రమం లో నాగబాబు తో పాటు జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ , పెండెం దొరబాబు వంటి వారు పాల్గొన్నారు. వర్మ తో జరిగిన గొడవ గురించి కానీ , వర్మ గురించి కానీ నాగబాబు మాట్లాడేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు. అనంతరం అక్కడికి వచ్చిన స్థానిక జనసేన పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ నాగబాబు చేసిన కామెంట్స్ పెద్ద సంచలనానికి దారి తీసింది. ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.

ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడ ఇంత మంది చాలా సేపటి నుండి మాట్లాడుతున్నారు. ఒక్కరైనా పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అడిగారా?, అసలు సెన్స్ ఉందా మీకు. పిఠాపురం నగర నియోజకవర్గం లో ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎప్పుడూ చూడని అద్భుతాలు జరుగుతున్నాయి. మీకోసం ఆయన ఆరోగ్యం కూడా పాడైంది. అడగాల్సిన బాధ్యత మీకు లేదా ?, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, కోలుకుంటున్నాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గానే అధికారులతో సమావేశమైనప్పుడు పవన్ కళ్యాణ్ తీవ్రమైన అనారోగ్యానికి గురవ్వడం, ఆ తర్వాత ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లి నాసల్ సర్జరీ చేయడం వంటివి జరిగాయి. డాక్టర్లు వారం నుండి 10 రోజుల వరకు రెస్ట్ తీసుకోవాలని సూచించడం తో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper