Homeక్రీడలుPV Sindhu eye device: పీవీ సింధుకు ఏమైంది.. కంటి పక్కన ఆ పరికరం ఎందుకు..

PV Sindhu eye device: పీవీ సింధుకు ఏమైంది.. కంటి పక్కన ఆ పరికరం ఎందుకు..

PV Sindhu eye device: పీవీ సింధు.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయవాక్యం అవసరం లేదు. ఎందుకంటే బ్యాడ్మింటన్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం ఈమె. ఒలంపిక్స్ లో కూడా సత్తా చూపించి తెలుగు వాళ్ళ గౌరవాన్ని ప్రపంచ వేదిక మీద చాటింది. మొత్తంగా యావత్ భారతావనికి గర్వకారణంగా నిలిచింది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పీవీ సింధు.. ఇటీవల ఉబెర్ కప్ మ్యాచ్ లో ఆడింది. ఈ టోర్నీలో భాగంగా సింధు […]

PV Sindhu eye device: పీవీ సింధు.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయవాక్యం అవసరం లేదు. ఎందుకంటే బ్యాడ్మింటన్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం ఈమె. ఒలంపిక్స్ లో కూడా సత్తా చూపించి తెలుగు వాళ్ళ గౌరవాన్ని ప్రపంచ వేదిక మీద చాటింది. మొత్తంగా యావత్ భారతావనికి గర్వకారణంగా నిలిచింది. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న పీవీ సింధు.. ఇటీవల ఉబెర్ కప్ మ్యాచ్ లో ఆడింది.

ఈ టోర్నీలో భాగంగా సింధు తన కంటి పక్కన ఒక స్టికర్ లాంటి పరికరాన్ని ధరించింది. మొదట్లో ఈ పరికరాన్ని చూసి చాలామంది ఆమె కంటికి ఏదైనా గాయం అయిందేమో అని అనుకున్నారు. కానీ గాయం అయిన దాఖలాలు కనిపించలేదు. మ్యాచ్ జరిగినంత సేపు అందరూ ఆమె ధరించిన ఆ స్టిక్కర్ చూశారు.

అది మామూలు స్టిక్కర్ కాదు. దానిని టెంపుల్ అని పిలుస్తుంటారు. ఇది మెదడు అని తీరును పసిగడుతుంది. ముఖ్యంగా క్రీడాకారుల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. దీనిద్వారా మెదడులో రక్తప్రసరణ.. ఆలోచనల తీవ్రత.. ఏకాగ్రత స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటుంది.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్లేయర్లు ఎందుకు ఒత్తిడికి గురవుతున్నారు.. ఏ సమయంలో వారిలో ఏకాగ్రత సాధ్యమైంది.. వంటి అంశాలను ఈ పరికరం సమాచార రూపంలో అంచనా వేస్తుంది.. క్రీడాకారుల మానసిక స్థితిని అర్థం చేసుకుంటుంది. తద్వారా వారి ప్రదర్శన మెరుగుపడేందుకు ఇది ఉపకరిస్తుంది.

ఈ పరికరాన్ని ప్రముఖ వ్యాపారవేత్త జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్, పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి కూడా రూపొందించారు. దీనిని స్పోర్ట్స్ టెక్నాలజీలో వినూత్నమైన విప్లవమని నిపుణులు చెబుతున్నారు.. ఈ పరికరాన్ని తయారు చేసిన తర్వాత పీవీ సింధు మీద తొలిసారి ప్రయోగించారు.. మైదానంలో ఆటగాళ్ల మెదడు ఏ విధంగా స్పందిస్తుందో తెలుసుకోవడానికి ఆమెకు స్టిక్ చేశారు. ఈ పరికరం అందించే సమాచారం కోచ్ లకు అత్యంత కీలకమవుతుంది. భవిష్యత్ కాలంలో ఈ టెక్నాలజీ చాలామంది ప్లేయర్లకు విస్తృతంగా ఉపయోగపడుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper