Tollywood: కరోనా వైరస్ రెండేళ్ల వ్యవధిలో కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఒక్క ఇండియాలోనే లక్షల్లో కన్నుమూశారు. భారత ప్రభుత్వం బయటపెట్టని అనధికారిక మరణాలు లెక్కలేనన్ని ఉన్నాయి. గంగానది తీరంలో శవాల గుట్టలు, దహన సంస్కారాల కోసం స్మశాన వాటికలు వద్ద క్యూలైన్లో శవాలు, వారి తాలూకు బంధువులు. క్షణం ప్రశాంతత లేకుండా హడావుడిగా ఉండే నగరాలు నిర్మానుష్యంగా తయారయ్యాయి. మెట్రోపోలిటన్ నగరాల్లో ముళ్ల కంచెలు కనిపించాయి. కరోనా పరిచయం చేసిన ఊహించని పరిస్థితులను వివరించాలంటే.. ఒక రోజు సరిపోదు.
మనిషిని మనిషికి దూరం చేసిన కరోనా నుండి ప్రపంచం బయటపడింది. భారత్ లో నెలల తరబడి లాక్ డౌన్ కొనసాగింది. వైరస్ మాత్రమే కాదు లాక్ డౌన్ కూడా మనుషుల ప్రాణాలు తీసింది. లాక్ డౌన్ తో అన్ని పరిశ్రమలు కుదేలయ్యాయి. వాటిలో చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. 2020 మార్చి నుండి పూర్తి స్థాయి లాక్ డౌన్ విధించడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఉపాధి లేక ఆకలి చావులు చోటు చేసుకున్నాయి.
కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. తాజాగా HMPV పేరుతో మరో ప్రాణాంతక వ్యాధి విజృంభిస్తుంది. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ కేసులు భారత్ లో నమోదు అవుతున్నాయి. కరోనా మాదిరి ఇది కూడా గాలిలో వ్యాపించే వైరస్. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, తాకిన వస్తువులు ఇతరులు తాకినా సోకే ప్రమాదం ఉంది. ఇండియన్ గవర్నమెంట్ ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా పిల్లలకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
కాగా మరోవైపు లాక్ డౌన్ ఊహాగానాలు ఊపందుకున్నాయి. HMPV వ్యాప్తిని నివారించేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించే అవకాశం కలదంటున్నారు. అదే జరిగితే చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లినట్లే. షూటింగ్స్ ఆగిపోతాయి. షూటింగ్ ఆలస్యమైతే బడ్జెట్స్ పెరిగిపోతాయి. చిన్నా చితకా నటులు, జూనియర్ ఆర్టిస్ట్స్, ఇతర సిబ్బంది ఉపాధి కోల్పోతారు. 2025లో ప్రభాస్ నటించిన రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర, ఎన్టీఆర్ వార్ 2 విడుదల కావాల్సి ఉంది. ఈ చిత్రాల రిలీజ్ కి బ్రేక్ పడే అవకాశం ఉంది. ఇక భారీ బడ్జెట్ మూవీ ఎస్ఎస్ఎంబి 29 షూటింగ్ అటకెక్కుతుంది. మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వేల కోట్లు నష్టపోనుంది.