Paradise Movie: ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్ చేసి ప్రేక్షకులు అటెన్షన్ ను తన వైపు తిప్పుకునే ప్రొడ్యూసర్ నాగ వంశీ… భారీ సినిమాలను నిర్మిస్తూ టాప్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నప్పటికి ఆయన ఏదో ఒక విషయంలో కాంట్రవర్సీ కామెంట్స్ అయితే చేస్తాడు. అలాంటి నాగ వంశీ ఇప్పుడు ప్యారడైజ్ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడు వచ్చిన సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు సైకిల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే పారడైజ్ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. 200 కోట్లకు పైన బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి ని సంపాదించుకుంటుంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది.
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక క్రెడిబులిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అలాగే ఈ మధ్య కాలంలో నాని చేసిన సినిమాలకు భారీ కలెక్షన్స్ రావడం లేదనే ఒక విమర్శిని ఆయన మోస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో 300 కోట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సక్సెస్ ను సాధిస్తుందా?
ప్రేక్షకుడికి ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మధ్యలో నాగ వంశీ ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉండటం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది…ఈ సినిమాకి నాగ వంశీ డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికైతే ఆయన కనక డిస్ట్రిబ్యూట్ చేసినట్లయితే మాత్రం సినిమా మంచి రిలీజ్ అవుతుంది. అలాగే ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టే అవకాశాలైతే ఉన్నాయి…

