Naga Chaitanya Comments On Nagarjuna: అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ఇంటర్వ్యూస్ చాలా అరుదుగా ఇస్తుంటాడు. తన సినిమా ప్రొమోషన్స్ సమయం లో తప్ప, బయట ఎక్కువగా కనిపించడు. అలాంటి నాగ చైతన్య జీ తెలుగు ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu Nischayammu Raa) టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోకి జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా, ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది ఈ షో. జగపతి బాబు హోస్టింగ్ కూడా అద్భుతం అనే చెప్పాలి. ఆయన తన మనసుకి బాగా దగ్గరైన వాళ్లనే ఇంటర్వ్యూ కి పిలిపించుకుంటున్నాడు. అక్కినేని ఫ్యామిలీ కి బాగా కావాల్సినవాడు కాబట్టి మొదటి ఎపిసోడ్ ని నాగార్జున తోనే మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన తనయుడు నాగ చైతన్య తో చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.
ముఖ్యంగా తన తండ్రి నాగార్జున తో కలిసి పని చేసిన అనుభూతిని ఈ ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు నాగ చైతన్య. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు మనం, బంగార్రాజు వంటి చిత్రాలు వచ్చాయి. రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా చాలా పెద్ద హిట్స్ అయ్యాయి. కానీ తన తండ్రి తో కలిసి పని చేయడం నరకమట. ఈ విషయాన్ని స్వయంగా నాగ చైతన్య ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నాన్నకి ఏది ఒక పట్టాన నచ్చదు. మా ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి, ఎక్కడా కూడా నా క్యారక్టర్ లో లోపం ఉండకుండా చూసుకునేవాడు. అందుకోసం ఎన్నో టేకులు, కథలో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. నాన్న గారు మనం సినిమాకు ఎంతో ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాడు. అంత కఠినంగా ఆయన సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు, ఔట్పుట్ గురించి తగ్గకుండా చూడడం గతంలో నేనెప్పుడూ చూడలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.
ఇంకా ఈ ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలను పంచుకున్నాడు. అక్కినేని ఫ్యాన్స్ కి ఈ ఇంటర్వ్యూ ఒక విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. జీ 5 యాప్ లో అందుబాటులో ఉంది వెంటనే చూసేయండి. అయితే ఇంటర్వ్యూ లో ఎక్కడైనా తన మాజీ భార్య సమంత గురించి మాట్లాడుతాడేమో, ఆమె ప్రస్తావన వస్తుందేమో అని అంతా అనుకున్నారు కానీ, ఎక్కడా కూడా ఆమె ప్రస్తావన రాలేదు. తన జీవితంలో ఎన్నో లవ్ రిలేషన్ షిప్స్ ఉన్నాయని, స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లలో బోలెడన్ని క్రష్ లు ఉండేవని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.