Naga Chaitanya: జగపతి బాబు(Jagapathi Babu) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ జీ తెలుగు ఛానల్ లో ‘జయమ్ము నిశ్చయమ్మురా'(Jayammu nischayammuraa) అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి 8 ఎపిసోడ్స్ ప్రసారం అయ్యాయి. అన్నిటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా మన ఇంట్లో ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ షో. మొదటి ఎపిసోడ్ అక్కినేని నాగార్జున తో చేసిన సంగతి తెలిసిందే. నాగార్జున కు జగపతి బాబు ఫ్యామిలీ ఫ్రెండ్ అనే విషయం ఈ షో చూసిన తర్వాతే తెలిసింది. ఇక రీసెంట్ ఎపిసోడ్ కి ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య (Akkineni Nagarjuna) విచ్చేశాడు. ఆయనతో కలిసి సరదాగా జగపతి బాబు జరిపిన సంభాషణ చూసే ఆడియన్స్ కి, అక్కినేని ఫ్యాన్స్ కి చాలా సంతృప్తి ని ఇచ్చింది. నాగ చైతన్య లో ఎవ్వరూ చూడని యాంగిల్ ని బయటకు తీసే ప్రయత్నం చేసాడు జగపతి బాబు.
ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య మొదట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?, సినిమాల్లోకి రాకముందు ఆయన ఒక బ్రాండ్ ట్రూప్ లో ఉండేవాడట. ఆ సమయం లో ఎన్నో ఇంగ్లీష్ ఆల్బమ్స్ ని కంపోజ్ చేసాడట నాగ చైతన్య. ఈ విషయం జగపతి బాబు చెప్తే తెలిసింది. నీ మ్యూజిక్ టాలెంట్ ని సినిమాలకు కూడా వాడుకున్నావా?, ఏ సినిమాకి అయినా మ్యూజిక్ అందించావా అని అడగ్గా, దానికి నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘నా సినిమాలకు మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చోవడం జరిగింది కానీ, నేను మ్యూజిక్ ఇవ్వడం కానీ, నేను చెప్పినట్టే కంపోజ్ చేయమని చెప్పడం కానీ ఎప్పుడూ జరగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. కానీ ఆయన ప్రతీ సినిమాలు ఆల్బమ్ పరంగా సూపర్ హిట్ రేంజ్ లో ఉంటాయి.
మొదటి సినిమా నుండి అంతే, చూస్తుంటే నాగ చైతన్య ఇన్ పుట్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ కి వెళ్లినట్టు గానే అనిపిస్తున్నాయి. ఈ ఇంటర్వ్యూ మొత్తం నాగ చైతన్య జగపతి బాబు ని చౌ మామ అంటూ పిలిచాడు. అక్కినేని ఫ్యామిలీ మొత్తం జగపతి బాబు ని చౌ అని పిలుస్తుంటారు. నాగార్జున, ఆయన సోదరుడు వెంకట్ కూడా చౌ అనే పిలిచారు. ఇప్పుడు నాగ చైతన్య కూడా అలాగే పిలుస్తున్నాడు. చిన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని తిరగలేదు కానీ, పెద్దవాడివి అయ్యాక నువ్వు నాకు పరిచయం అయ్యావు, నాకు 24 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు నువ్వు పుట్టావు అంటూ చెప్పుకొచ్చాడు జగపతి బాబు. గతం లో వీళ్లిద్దరు కలిసి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో తండ్రి కొడుకులుగా నటించారు. వీళ్ళ మధ్య బాండింగ్ ఆ సినిమాలో చాలా సహజంగా అనిపించింది.