spot_img
Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya: 'ఏజెంట్' ఫ్లాప్ పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya: ‘ఏజెంట్’ ఫ్లాప్ పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya: గత కొంత కాలం నుండి అక్కినేని ఫ్యామిలీ గడ్డుకాలం ని ఎదురుకుంటుంది. చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తున్నాయి. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘బంగార్రాజు’ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత విడుదలైన అక్కినేని సినిమాలు ‘ది ఘోస్ట్’, ‘థాంక్యూ’ మరియు రీసెంట్ గా ‘ఏజెంట్’ చిత్రాలు కనీసం పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

ఇది నిజంగా అక్కినేని కుటుంబానికి ఎంతో అవమానకరమైనది. మిగిలిన రెండు సినిమాలు ఫ్లాప్ అయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ, ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ లాంటి భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం, అక్కినేని కుటుంబ అభిమానులు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యేలా చేసింది. ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ మొత్తం ఒక భారీ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఆ కంబ్యాక్ అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కస్టడీ’ తో సాధ్యపడుతుందని అనుకుంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 12 వ తారీఖున విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా నిన్న మూవీ యూనిట్ ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.

ఈ ప్రెస్ మీట్ లో ఒక విలేఖరి నాగ చైతన్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘గత కొంతకాలం నుండి మీ కుటుంబం నుండి వస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ ఒక సరైన కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు’ అని అడగగా , దానిలోకి నాగ చైతన్య సమాధానం చెప్తూ ‘అభిమానులు మాపై చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేనిది. ప్రతీ సినిమా సూపర్ హిట్ అవ్వాలనే తీస్తాము, కొన్ని కొన్ని సార్లు అంచనాలు అందుకోలేకపోవచ్చు, రీసెంట్ టైం లో ‘ఏజెంట్’ విషయం లో కూడా అదే జరిగింది. కానీ ‘కస్టడీ’ చిత్రం చాలా బాగా వచ్చింది, అభిమానులు కోరుకునే భారీ కమర్షియల్ సక్సెస్ ఈ చిత్రం తో లభిస్తుంది అని నమ్మకం తో ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Oktelugu Epaper
Exit mobile version