Naga Chaitanya: నాగ చైతన్య – శోభిత దూళిపాళ్ల ఎలా కలిశారు, ఎలా ప్రేమించుకున్నారు? అనేది ప్రస్తుతానికి ఒక మిస్టరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్లిద్దరు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు, కేవలం నాగ చైతన్య తోనే కాదు, అక్కినేని ఫ్యామిలీ లో ఏ హీరోతో కూడా ఈమె నటించలేదు. రామ్ చరణ్ తో ఒక యాడ్ చేసింది కానీ, నాగ చైతన్య తో మాత్రం కనీసం యాడ్ కూడా చెయ్యలేదు. అలా వీళ్ళు కలిసేందుకు ఏమాత్రం స్కోప్ లేకపోయినప్పటికీ కూడా , ఎలా ప్రేమించుకున్నారు అనేది మిస్టరీ గానే మిగిలిపోయింది. సమంత తో వైవాహిక జీవితం లో ఉన్నప్పుడే వీళ్లిద్దరు ప్రేమించుకున్నారని, రహస్య గా మైంటైన్ చేసిన ఈ రిలేషన్ కారణంగానే సమంత తో విడాకులు జరిగిందని, ఇలా పలు రకాల కథనాలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది కానీ, అవన్నీ ఊహాగానాలే అని చెప్పొచ్చు.
వీళ్ళ లవ్ స్టోరీ ఎలా మొదలైంది అనేది వీళ్ళు నోరు విప్పితేనే తెలుస్తుంది. అలా వీళ్లిద్దరు నోరు విప్పే సమయం ఆసన్నమైంది అంటూ సోషల్ మీడియా లో ఇప్పుడు ఒక వార్త తెగ ప్రచారం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే త్వరలోనే రానా దగ్గుపాటి అమెజాన్ ప్రైమ్ సంస్థ కోసం ఒక టాక్ షో చేయనున్నాడు. ఈ టాక్ షో కి టాలీవుడ్, బాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేస్తారు. అలా ఒక ఎపిసోడ్ కి నాగ చైతన్య, శోభిత కలిసి రాబోతున్నారట. రానా తో కాసేపు ఈ ఎపిసోడ్ లో చిట్ చాట్ చేయబోతున్నారట. ఈ చిట్ చాట్ లో వీళ్లిద్దరి లవ్ స్టోరీ బయటపడే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారం లో ఎవరిది తప్పు అనేది తెలిసిపోతుంది. గతం లో రానా దగ్గుపాటి జెమినీ టీవీ లో ‘నెంబర్ 1 యారి విత్ రానా’ అనే టాక్ షో చేసాడు.
రెండు సీజన్స్ గా ప్రసారమైన ఈ టాక్ షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ టాక్ కి ఒక ఎపిసోడ్ కి నాగ చైతన్య, సుమంత్ ముఖ్య అతిథులుగా విచేస్తే, మరో ఎపిసోడ్ కి సమంత, చిన్మయి ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు. చాలా సరదాగా ఈ టాక్ షో గడిచిపోతుంది. అలాంటి టాక్ షో నే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ సంస్థ రానా తో చేయబోతుంది. ఇది అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇండియా లో మొట్టమొదటి సారిగా నిర్వహించబోతున్న టాక్ షో గా మనం చూడొచ్చు. ఇది వరకు కేవలం సినిమాలు, వెబ్ సిరీస్ లతోనే ప్రేక్షకులను అలరించిన అమెజాన్ ప్రైమ్, ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక టాక్ షో ద్వారా మన ముందుకు రాబోతుంది. మరి దీనికి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి. ఈ షో కోసం రానా భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.