https://oktelugu.com/

Naga Chaitanya: సమంత గురించి అడగొద్దు – చైతు

Naga Chaitanya: ‘సమంత గురించి ఎట్టిపరిస్థితుల్లో ఎవరు అడగొద్దు’ ఇది నాగ చైతన్య ఇంటర్వ్యూస్ కి ముందు చెబుతున్న మాట. అక్కినేని సమంత (Samantha Akkineni)తో చైతు నిజంగానే విడిపోతున్నాడా ? ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఈ ప్రశ్న మీడియా అడుగుతుందేమో అని, బయటకు రావడానికి కూడా చైతు – సామ్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు నెటిజన్లకు అలాగే టాలీవుడ్ మీడియాకీ బాగా దూరంగా ఉంటున్నారు. కానీ అక్కినేని […]

Written By:
  • admin
  • , Updated On : September 17, 2021 / 05:01 PM IST
    Follow us on

    Naga Chaitanya: ‘సమంత గురించి ఎట్టిపరిస్థితుల్లో ఎవరు అడగొద్దు’ ఇది నాగ చైతన్య ఇంటర్వ్యూస్ కి ముందు చెబుతున్న మాట. అక్కినేని సమంత (Samantha Akkineni)తో చైతు నిజంగానే విడిపోతున్నాడా ? ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఈ ప్రశ్న మీడియా అడుగుతుందేమో అని, బయటకు రావడానికి కూడా చైతు – సామ్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తెలుగు నెటిజన్లకు అలాగే టాలీవుడ్ మీడియాకీ బాగా దూరంగా ఉంటున్నారు.

    కానీ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)ల ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. నాగ చైతన్య కి ఇష్టం లేకపోయినా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చింది. దాంతో ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం చైతన్య – సమంత విడాకుల గురించే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది కాబట్టి.. నాగ చైతన్య కనిపిస్తే కచ్చితంగా మీడియా ఈ ప్రశ్న అడుగుతుంది.

    అందుకే, ఈ ప్రశ్న అడగకూడదు అని ముందే చైతు పీఆర్వోల టీం మీడియా వ్యక్తులకు మెసేజ్ లు పాస్ చేస్తున్నారు. ఎలాగూ ఇప్పటికే ఈ వార్త పై కొంత క్లారిటీ వచ్చింది. అయినా చైతు మాత్రం ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటించడానికి ఇష్టపడట్లేదు. అందుకే, సామ్ గురించి తనను ఏమి అడగొద్దు అంటూ కండిషన్ పెడుతున్నాడు.

    నాగ చైతన్య రేపు, ఎల్లుండి కొన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ ఇంటర్వ్యూలలో కొన్ని లైవ్ ఉన్నాయి. పొరపాటున విడాకులకు సంబంధించిన ప్రశ్న వేస్తే.. తానూ ఇబ్బంది పడాల్సి వస్తోంది అని చైతు ముందుగానే ప్లాన్డ్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇక ‘లవ్ స్టోరీ’ ఈ నెల 24న విడుదల కానుంది.

    అన్నట్టు సమంత కూడా ఈ ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి టాలీవుడ్ మీడియాకీ బాగా దూరంగా ఉంటుంది. అందుకే సైలెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీకి ఇచ్చి అక్కడే కొన్నాళ్ళు ఉండిపోవాలని నిర్ణయించుకుంది.