Homeఅప్పటి ముచ్చట్లుANR : ఏఎన్నార్ ఆయన వల్లే నిర్మాతయ్యారు !

ANR : ఏఎన్నార్ ఆయన వల్లే నిర్మాతయ్యారు !

ANRANR: తెలుగు స్వర్ణయుగంలో ఎన్నో గొప్ప చిత్రాలు వచ్చాయి. వాటిల్లో ‘సుడిగుండాలు’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా మరువలేని, మరపురాని బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోవడానికి కారణం.. ఇదొక అందమైన దృశ్యకావ్యం. మధురమైన పాటల పందిరిలో సేద తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు గోదావరి ఒడ్డున పాత భవంతి మేడమీద నుండి గోదారి పరవళ్ళలో ఊగిసలాడే నాటు పడవను, ఒడ్డున పూరి గుడిసెను మన కళ్ళతో చూస్తున్న భావన కలుగుతుంది.

అన్నిటికీ మించి ఏఎన్నార్ నటన మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. ఇక ఈ చిత్ర కథలోని సహజత్వం, దర్శకత్వంలోని గొప్పతనం, సంగీతం లోని మధురం ఈ చిత్రానికి గొప్ప బలాలు. రెండు, మూడు సింపుల్ లొకేషన్స్ లో, ఇక కోర్టు సీన్ చుట్టూ తిరిగే ఈ చిత్రం అప్పటి కాలం కన్నా ఈనాటి పరిస్థితులకు బాగా సరిపోతుంది.

అయితే ఇంత గొప్ప సినిమా మొదలు కావడానికి చాలా అవరోధాలు ఎదురయ్యాయి. సుడిగుండాలు సినిమాకి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, అయితే ఈ సినిమాని నిర్మించడానికి ఆయన తన ఆస్తుల తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అప్పటికే ఆదుర్తి సుబ్బారావు అంటే.. గొప్ప దర్శకుడు. అయినా, ఎందుకో సుడిగుండాలు సినిమా తీయడానికి ఏ నిర్మాత ముందుకు రాలేదు.

ఇక చేసేది ఏమి లేక ఆదుర్తిగారు తన దర్శకత్వంలో తన నిర్మాణంలోనే ఈ సినిమా మొదలుపెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు, సుకన్య ప్రధాన పాత్రల కోసం తీసుకున్నారు. అయితే, అక్కినేని నాగేశ్వరరావుకి ఆదుర్తిగారు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని తెలిసింది. అక్కినేని కూడా నిర్మాణంలో భాగం కావాలని నిర్ణయించుకున్నారు.

దాంతో ఆదుర్తి సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు సంయుక్తంగా చక్రవర్తి చిత్ర అనే సంస్థ స్ధాపించి చిత్రనిర్మాణం సాగించారు. అలా ఏఎన్నార్ అదుర్తిగారి వల్ల నిర్మాత అయ్యారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version