https://oktelugu.com/

Naga Chaitanya: కిరణ్ అబ్బవరం పై వచ్చిన ట్రోల్ల్స్ ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న నాగ చైతన్య..వైరల్ అవుతున్న ఎమోషనల్ కామెంట్స్!

రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరు అవుతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 30, 2024 / 04:11 PM IST

    Naga Chaitanya(3)

    Follow us on

    Naga Chaitanya: ఒక సెలబ్రిటీ అన్న తర్వాత అభిమానులతో పాటు, ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా ఇది తప్పదు. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత ఎవరికైనా బాగా కోపం వచ్చేస్తుంది. సెలెబ్రిటీలు అయ్యినంత మాత్రాన వాళ్ళు కూడా సాధారణమైన మనుషులే కదా. అయితే ఇండస్ట్రీ కి కొత్తగా వచ్చిన హీరోల మీద కూడా ఈ మధ్య అన్యాయంగా కొంతమంది ట్రోల్ల్స్ వేస్తున్నారు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎదురుకుంటున్నాడు. ఇతను కొంతమంది హీరోలు లాగా అతి మాటలు మాట్లాడడు, చాలా వినయంతో ప్రవర్తిస్తాడు. సినిమాలు కూడా 8 చేస్తే అందులో నాలుగు సూపర్ హిట్ అయ్యాయి. అయినప్పటికీ ఎందుకు ఇతన్ని ఇంత టార్గెట్ చేస్తారో ఎవరికీ అర్థం కాదు. రీసెంట్ గా ఆయన ‘క’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేసాడు.

    రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అక్కినేని నాగ చైతన్య ముఖ్య అతిథిగా హాజరు అవుతాడు. కిరణ్ అబ్బవరం ప్రసంగంకి ఎంతో ఎమోషనల్ అయిన నాగ చైతన్య మాట్లాడుతూ ‘కిరణ్ అబ్బవరం మాటలు విన్న తర్వాత ఏమి మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. నాకు కిరణ్ చెన్నై లో పరిచయం అయ్యాడు. నేను కార్ రేసింగ్ ఈవెంట్స్ కి వెళ్తూ ఉంటాను, అక్కడ కిరణ్ ని చూసి ఆశ్చర్యపోయాను, ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు అని. అతనితో మాట్లాడిన తర్వాత ఎంత నిజాయితీ గల మనిషో అర్థమైంది. ఇతనికి కచ్చితంగా భవిష్యత్తులో ఏదైనా చెయ్యాలి అనుకున్నాను. ‘క’ థియేట్రికల్ ట్రైలర్ ని నేను చూసాను, చాలా బాగా అనిపించింది. నిన్న కిరణ్ నాకు ఫోన్ చేసి, నా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తావా అన్నా అని అడిగాడు. ఇలాంటి గొప్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం నా అదృష్టం గా భావించాను. ఇందాక బయలుదేరే ముందు నా స్నేహితుడితో ‘క’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నాను అంటూ మాటవరుసకి చెప్పాను. అది చెప్పగానే ‘ఓ కిరణ్ అబ్బవరం సినిమానా’ అని అతను అడిగాడు. నీ సినిమా పేరు కంటే ముందు నీ పేరు గుర్తుకు వస్తుంది ఆడియన్స్ కి, అది నువ్వు సొంతంగా సంపాదించుకున్నది. ఇలాగే నువ్వు ముందుకు దూసుకుపోవాలి. ట్రోల్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్లకు కేవలం ఒక ఫోన్, కీ ప్యాడ్ ఉంటే చాలు,వాళ్లకి బ్రెయిన్ ఉండదు..అలాంటి వాళ్ళని పట్టించుకోకు’ అంటూ నాగ చైతన్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ మంచి మనసుతో నాగ చైతన్య ఇలాంటి మాటలు మాట్లాడడం ప్రశంసనీయం అంటూ ఆయన్ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభినందిస్తున్నారు.