Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya Satires On Samantha: సమంత పై సెటైర్లు వేసిన నాగ చైతన్య

Naga Chaitanya Satires On Samantha: సమంత పై సెటైర్లు వేసిన నాగ చైతన్య

Naga Chaitanya Satires On Samantha: సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒక్కరిగా పేరు తెచ్చుకున్న సమంత మరియు నాగ చైతన్య విడిపోవడం అందరిని షాక్ కి గురి చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా పరిచయం అయినా వీళ్లిద్దరి స్నేహం ప్రేమగా మారి 2017 వ సంవత్సరం లో అతిరథ మహారథుల సమక్షం లో పెళ్లి చేసుకున్నారు..అంత సజావుగా సాగుతుంది అని అందరూ అనుకునేలోపు వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి..అవి పుకార్లే అని అభిమానులు సర్దిచెప్పుకుంటున్న సమయం లో మేము విడిపోవాలి అని నిర్ణయం తీసుకున్నాము అని అటు సమంత ఇటు నాగ చైతన్య తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అధికారికంగా ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు..విడాకులు తీసుకున్న తర్వాత అటు నాగ చైతన్య ఇటు సమంత ఎవరికీ వారు కెరీర్ పరంగా ఫుల్ బిజీ అయ్యారు..కానీ సమంత మాత్రం అప్పుడప్పుడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో నాగ చైతన్య కి తాకేటట్టుగా పరోక్షంగా కొన్ని పోస్టులు పెడుతూ ఉంటుంది.

 Naga Chaitanya Satires On Samantha
Naga Chaitanya, Samantha

Also Read: Jabardasth Kiraak RP Engagement Photos: ప్రేమించిన అమ్మాయితోనే కిరాక్ ఆర్పీ ఎంగేజ్ మెంట్.. ఆమె ఎవరో తెలుసా?

కానీ నాగ చైతన్య మాత్రం విడాకులు తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా సమంత ని ఉద్దేశించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక్క కామెంట్ కూడా చెయ్యలేదు..సోషల్ మీడియా లో కూడా ఆయన విడాకులు తీసుకున్న తర్వాత యాక్టీవ్ గా ఉండడం చాలా తక్కువ అనే చెప్పొచ్చు..కానీ ఇటీవల ఆయన హీరో గా నటించిన థాంక్యూ అనే సినిమా టీజర్ ఒక్కటి విడుదల అయ్యింది..ఈ టీజర్ లో నాగ చైతన్య చెప్పిన ఒక్క డైలాగు వైరల్ గా మారింది..అదేమిటి అంటే ‘జీవితం లో ఏ విషయం లో అయినా కాంప్ర‌మైజ్ అయ్యే ప్ర‌శ‌క్తే లేదు..వాటికోసం ఎన్నెన్నో వ‌దులుకుని ఇక్క‌డిదాకా వ‌చ్చాను’ అంటూ చెప్పిన డైలాగ్ సమంత ని ఉద్దేశించి చెప్పిన డైలాగ్ గా నెటిజెన్ల భావిస్తున్నారు..మరి దీనికి సమంత ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి..ఇక థాంక్యూ సినిమా విషయానికి వస్తే అక్కినేని ఫామిలీ తో మనం వంటి సెన్సషనల్ హిట్ చేసిన తర్వాత నాగ చైతన్య తో విక్రమ్ కె కుమార్ చేస్తున్న చిత్రం ఇది..ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది..ఇప్పటికే విడుదల అయినా టీజర్ అందరిని ఎంతో ఆకట్టుకోవడం తో సినిమా కూడా అదే స్థాయిలో అలరిస్తుంది అని అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..చూడాలి మరి వారి అంచనాలను ఈ సినిమా ఎంత వరుకు రీచ్ అవుతుంది అనేది.

Also Read: Power Cuts Again AP: మళ్లీ విద్యుత్ కోతలు..భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

Recommended Videos:
జగన్ దావోస్ పర్యటనపై దేవినేని సంచలన వ్యాఖ్యలు || Devineni Uma Comments On CM Jagan Davos Tour

జన సైనికుల మీద అక్రమ కేసులు పెడితే || Janasena Leader Comments on Illegal Arrests in Amalapuram

కోనసీమలో అల్లర్లు సృష్టించిన ఘనత వైసీపీదే || Pothina Mahesh Fires on CM Jagan || Konaseema Issue

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version