Star Hero Missed Aadi Movie: మన టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..చిన్నతనం లోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ చిచ్చర పిడుగు ఆ వయస్సులోనే చూసిన మాస్ యుఫొరియా ఇండియా లో ఏ హీరో కూడ చూడలేదు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..అతనికి ఆ స్థాయి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చి పెట్టిన సినిమాలు ఆది మరియు సింహాద్రి..కెరీర్ ప్రారంభం లో ఇలాంటి మాస్ హిట్స్ ఏ హీరోకి పడలేదు అని చెప్పొచ్చు..ముఖ్యంగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆది సినిమాకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి..ఈ సినిమాతోనే ఎన్టీఆర్ రాత్రికి రాత్రి స్టార్ హీరో గా ఎదిగిపోయాడు..ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రేక్షకులు అయితే ఎన్టీఆర్ మాస్ కి వెరెక్కిపోయారు..అప్పటి వరుకు ఇండస్ట్రీ లో డాన్స్ ఆడాలి అన్నా, ఫైట్స్ చెయ్యాలి అన్నా ,ఊర మాస్ సినిమాలు చెయ్యాలన్న అన్నిటికి చిరంజీవి మరియు బాలయ్య బాబు మాత్రమే..కానీ వీళ్లిద్దరి తర్వాత అవి అన్ని నేను కూడా చెయ్యగలను అని ఎన్టీఆర్ కి నిరూపించిన సినిమా ఆది.

ఎన్టీఆర్ కెరీర్ లో ఇంతటి ప్రత్యేకతలు నింపుకున్న ఈ సినిమా గురించి ఎవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అదేమిటి అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ని ఫారిన్ లో షూట్ చేస్తున్నారు..అదే సమయం లో నల్లమలపు బుజ్జి నిర్మాతగా సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చెప్పాలని ఉంది సినిమా షూటింగ్ కూడా జరిగింది..రెండు షూటింగ్స్ ఒక్కే ప్రాంతం లో జరుగుతూ ఉండడం తో నల్లమలపు బుజ్జి ఎన్టీఆర్ ని కలిసి ‘సార్! ఇతని పేరు వీవీ వినాయక్.ఇతని దగ్గర ఒక్క అద్భుతమైన స్టోరీ ఉంది..అది మీకు బాగా సూట్ అవుతుంది..కాసేపు టైం ఇస్తే కథ చెప్తాడు’ అని అడగగా, వినాయక్ ని చూసిన వెంటనే ఎన్టీఆర్ కి ఇతని డైరెక్టర్ లా కనిపించడం లేదు, కెరీర్ ప్రారంభం లోనే ఇలాంటోళ్ళతో రిస్క్ చెయ్యడం ఎందుకు అనుకున్నాడట..కానీ నిర్మాత నల్లమలపు బుజ్జి చెప్పాడు కాబట్టి ‘హైదరాబాద్ కి వెళ్లిన తర్వాత నన్ను కలవు’ అని వినాయక్ ఎదో మాటవరుసకి చెప్పాడట ఎన్టీఆర్.

Also Read: Romance In Flight: ట్రైనీ యువతితో ఫ్లైట్ లో శృంగారం..: వీడియో వైరల్
ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత నిర్మాత నల్లమలపు బుజ్జి పదే పదే ఎన్టీఆర్ ఇంటికి ఫోన్స్ చేస్తూ ఉండేవాడు అట..అతని టార్చర్ భరించలేక వినాయక్ ని ఇంటికి పిలిపించి స్టోరీ విని నచ్చలేదు అని చెప్పి పంపేద్దాం అనుకున్నాడట ఎన్టీఆర్..చివరికి వీవీ వినాయక్ ఎన్టీఆర్ ని కలవగానే పది నిమిషాలలో ఈ స్టోరీ లైన్ ని ఫినిష్ చెయ్యాలి అంటూ చెప్పాడట..అంతే ఇక వినాయక్ ముందు ఇంట్రడక్షన్ సీన్ ని చెప్పాడు..అక్కడే ఎన్టీఆర్ ఫిదా..అలా ఇంట్రడక్షన్ సన్నివేశం , ఇంటర్వెల్ సన్నివేశం మరియు క్లైమాక్స్ ఇలా మొత్తం వివరిస్తూ పొయ్యేలోపు మూడు గంటల సమయం గడిచిపోయింది అంట..కథ బాగా నచ్చడం తో వెంటనే ఎన్టీఆర్ పైకి లేచి వినాయక్ ని హత్తుకొని ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నయ్య అని చెప్పి మాట ఇచ్చాడట..ఇక ఆ తర్వాత హిస్టరీ మనకి తెలిసిందే..వాస్తవానికి ఈ సినిమా తొలుత నందమూరి బాలకృష్ణ కోసం రాసుకున్నాడు అట వినాయక్..ఆయనని కలిసేందుకు శతవిధాలా ప్రయత్నం చేసి, ఇక సాధ్యపడదు అని వదిలేస్తున్న సమయం లో ఎన్టీఆర్ ఇండస్ట్రీ కి రావడం..ఆ కథని ఇతను మాత్రమే హాండిల్ చెయ్యగలడు అని నమ్మి, ఎన్టీఆర్ కే తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి మొత్తానికి ఇండస్ట్రీ ని షేక్ చేసే హిట్ కొట్టాడు వినాయక్.
Also Read: Atmakur By Election: బీజేపీ ‘పోటీ’ ప్రకటన.. పవన్ కళ్యాణ్ బరిలోకి దిగాల్సిందేనా?



[…] Read: Star Hero Missed Aadi Movie: షాకింగ్.. ఆది సినిమాని వదుల… Recommended […]
[…] Also Read: Star Hero Missed Aadi Movie: షాకింగ్.. ఆది సినిమాని వదుల… […]