Prabhas Sandeep Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ… ప్రస్తుతం ఈయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ నెల నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. 2026 డిసెంబర్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. షూట్ స్టార్ట్ అయిన సంవత్సరం లోనే ఈ సినిమాని షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం అటు ప్రభాస్, ఇటు సందీప్ రెడ్డి వంగ భారీ రెమ్యూనరేషన్ ను చార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఈ సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో ప్రభాస్ 200 కోట్ల రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డివంగా దాదాపు 100 కోట్ల వరకు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు అంటూ శాపనార్ధాలు పెట్టిన మంచు లక్ష్మి!
ఇక మిగిలిన 300 కోట్ల తో సినిమాని తీయాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ రెమ్యూనరేషన్స్ భారీ గా ఉండటం వల్లే బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయిందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్లభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రొడ్యూసర్లు సైతం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేస్తు సినిమాలను చేస్తున్నారు.
కాబట్టి హీరోలు దర్శకులు సైతం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను తీసుకోవడంలో తప్పేమి లేదని మరి కొంతమంది సపోర్టుగా మాట్లాడుతుండటం విశేషం… ఇక ఎలాగైనా సరే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలని సందీప్ చాలా దృఢ సంకల్పంతో ఉన్నాడు.
అందుకోసమే కసరత్తులు చేస్తూ ఈ సినిమాను స్పెషల్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తను అనుకున్నట్టుగా ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… చూడాలి మరి ఈ సినిమా అటు ప్రభాస్ కి, ఇటు సందీప్ రెడ్డి వంగకి ఏ రకంగా హెల్ప్ అవుతుందనేది…