Naga Chaitanya and Shobhita : సమంత(Samantha Ruth Prabhu) తో విడాకులు తర్వాత అక్కినేని నాగ చైతన్య(Akkineni Nagachaitanya) ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Shobhita Dhulipala) ని రెండవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా డేటింగ్ చేస్తూ వచ్చిన ఈ జంట, జనవరి నెలలో అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యి సరిగ్గా ఆరు నెలలు కూడా కాలేదు. కానీ అప్పుడే అక్కినేని కుటుంబం లో ఎన్నో శుభాలు జరిగాయి. కేవలం N కన్వేషన్ హాల్ ని కూల్చివేసిన సంఘటన ఒక్కటి పక్కన పెడితే, చాలా కాలం నుండి ఫ్లాప్స్ లో ఉన్న నాగచైతన్య కి ‘తండేల్’ వంటి సెన్సేషనల్ హిట్ శోభిత తో పెళ్లి తర్వాతనే వచ్చింది. ఈ శుభం జరిగిన అతి కొద్దిరోజులకే మరో శుభవార్త వీళ్లకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అదేమిటంటే త్వరలోనే వీళ్లిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నారు అనేది.
Also Read : నాగ చైతన్య వైఫ్ శోభిత మళ్ళీ సినిమాలు చేస్తుందా..? వీళ్ళ కాంబోలో ఒక సినిమా వచ్చే అవకాశం ఉందా..?
అవును, మీరు వింటున్నది నిజమే, శోభిత రీసెంట్ గానే గర్భం దాల్చిందట. ఇండస్ట్రీ లోని అన్ని మీడియా చానెల్స్ కి ఈ వార్త కాసేపటి క్రితమే వెళ్ళింది. అయితే శోభిత గర్భం దాల్చిన తర్వాత, సమంత, నాగ చైతన్య ఎందుకు విడిపోయారు అనే అంశం పై అభిమానుల్లో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. నాగ చైతన్య కి పిల్లలు కావాలి, కానీ సమంత కి మాత్రం అప్పుడే వద్దు, నా కెరీర్ పీక్ రేంజ్ లో ఉంది, ఇంకా దానిని కొనసాగించాలి అని అనుకుంది, నాగ చైతన్య చాలా సంవత్సరాలు ఎదురు చూసాడు, కానీ సమంత అందుకు సిద్ధంగా లేదు, అందుకే నాగ చైతన్య ఆమెతో విభేదించి విడిపోయి ఉండొచ్చని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది. అదేమిటంటే రీసెంట్ గానే సమంత ఇన్ స్టాగ్రామ్ లోని ఒక ఆసక్తికరమైన పోస్ట్ కి లైక్ కొట్టింది.
అదేమిటంటే భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు భర్త విడిపోవాలని అనుకుంటుంటాడు, అదే భర్త అనారోగ్యం తో ఉంటే భార్య అతనికి గొడ్డు చాకిరి చేసి కాపాడాలని అనుకుంటుంది అనే పోస్ట్ ఉంటుంది. దానికి సమంత లైక్ కొట్టడం చూస్తుంటే, అనారోగ్యం కారణంగా సమంత బిడ్డకు జన్మని ఇచ్చేంత శక్తి ఇప్పుడు తనలో లేదని చెప్పడం, అందుకు నాగ చైతన్య తో సహా, అక్కినేని కుటుంబం మొత్తం ఒప్పుకోకపోవడం వల్లే వీళ్లిద్దరు ఒక ఒప్పందం ప్రకారం విడాకులు తీసుకున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ రెండు వైపుల నుండి వస్తున్న వాదనలు పరిశీలిస్తే వీళ్లిద్దరు కచ్చితంగా పిల్లల విషయంలోనే విడిపోయారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. అయితే నాగ చైతన్య శోభిత లకు పుట్టబోయేది పాప నా?, లేకపోతే బాబు నా? అనేది ఇంకా తెలియదు. పాప అయితే ఏమి పేరు పెడుతారు, బాబు అయితే ఏమి పేరు పెడతారని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు అభిమానులు.
Also Read : నాగ చైతన్య తో పెళ్లి కోసం శోభిత దూళిపాళ్ల పెట్టిన కండీషన్స్ చూస్తే నోరెళ్లబెడుతారు!