
Naga Chaitanya- Sobhita Dhulipala: సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమాయణం నడుపుతున్నాడని, ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారని గత కొంత కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రూమర్ జోరుగా ప్రచారం సాగుతూనే ఉంది.అయితే రీసెంట్ గా వీళ్లిద్దరు చాలాసార్లు కెమెరాలకు చిక్కడం తో అది రూమర్ కాదు, నిజమే అనే నిర్ధారణకు వచ్చేసారు అభిమానులు.
రీసెంట్ గా కూడా వీళ్లిద్దరు జంటగా కలిసి ఒక డిన్నర్ కి కూడా వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.మరి వీళ్లిద్దరి ఎప్పుడు ఓపెన్ అయ్యి అధికారికంగా ఒప్పుకొని పెళ్లి చేసుకుంటున్నారో చూడాలి.అయితే సమంత తో విడాకులు జరిగిన వెంటనే మరో పెళ్లి చేసుకుంటే జనాల్లో నెగటివిటీ వస్తుందని, అందుకే కొంతకాలం ఆగి పెళ్లి చేసుకుందామని శోభిత తో చెప్పాడట నాగ చైతన్య.

అయితే ఈ పెళ్లి కోసం శోభిత దూళిపాళ్ల నాగ చైతన్య తో రెండు కఠినమైన కండీషన్స్ పెట్టిందట.పెళ్లి చేసుకున్నాక జీవితాంతం కలిసి ఉంటాను అనే నమ్మకం ఇస్తేనే పెళ్లి చేసుకోవాలి అంట, మధ్యలో వదిలేసే పని అయితే ఆస్తులతో పాటు గా భరణం కూడా భారీ గానే చెల్లించాలట.
ఇక రెండవ కండీషన్ ఏమిటంటే పెళ్లి తర్వాత నాగచైతన్య రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదు అట.తనతో తప్ప ఏ హీరోయిన్ తో చేసిన అలాంటి సన్నివేశాలకు ఒప్పుకోకూడదని చెప్పిందట.ఆమె పెట్టిన ఈ రెండు కండీషన్స్ కి నాగ చైతన్య ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.మరో పక్క ఫ్యాన్స్ మాత్రం పెళ్ళికి ముందే ఇన్ని ఆంక్షలు పెడితే, ఇక పెళ్లి తర్వాత ఎలా ఉంటుందో అని నాగ చైతన్య ని ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు.