Canada elections 2025 : కెనడాలో ఏప్రిల్ 28 సోమవారం ఎన్నికలు జరుగబోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతోంది. ఎన్నికల సరళి ఎలా ఉండబోతోంది. ఇది షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లో జరుగబోతున్నాయి. కానీ ఇప్పుడు జరిగేవి స్నాప్ ఎన్నికలు..
భారత్ ను తీవ్రంగా వ్యతిరేకించే జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానిగా ఉండేవాడు. ప్రతీదానికి భారత్ పై విషం కక్కేవాడు. భారత్-కెనడా సంబంధాలు ఈయన కాలంలోనే పూర్తిగా దెబ్బతిన్నాయి. అన్ పాపులర్ అయ్యాడు. చివరకు పార్టీ వాళ్లు ఒత్తిడి చేస్తే రాజీనామా చేశాడు ట్రూడో. చివరకు ఆ పార్టీలోని మార్క్ కార్లే ప్రధానిగా ట్రూడో స్థానంలో ఎన్నికయ్యాడు. ఈయన ఎక్స్ బ్యాంక్ గవర్నర్.
ఎప్పుడైతే ట్రంప్ ప్రధాని అయ్యాక కెనడాపై టారీఫ్ లు ప్రకటించి ఆ దేశాన్ని 51వ రాష్ట్రంగా చేస్తామని సంచలన ప్రకటించడంతో కెనడా ఎన్నికలు ఇదే అంశంపై వేడిపుట్టాయి. ట్రంప్ ప్రకటనతో కెనడాలో అధికార పార్టీవైపు ప్రజలు మొగ్గుతున్నారు. ప్రతిపక్ష పార్టీ నేత కనర్జర్వేటివ్ అధినేత ట్రంప్ కు సన్నిహితుడు కావడంతో ఆయనపై అధికార లిబరల్ పార్టీ చేసిన ప్రచారం బాగా పనిచేసింది. ట్రూడో నాశనం అయిన లిబరల్ పార్టీకి ట్రంప్ వల్ల ఇప్పుడు మైలేజ్ వచ్చింది.
కెనడాలో 10 ప్రావిన్స్, 3 టెరిసరిస్ ఉన్నాయి. తూర్పున 4 ప్రావిన్సులు లిబరల్ పార్టీకి స్వీప్ చేసే అవకాశం ఉంటుంది. కిందనున్న అమెరికా సరిహద్దు 3 ప్రావిన్సులలో కన్జర్వేటివ్ పార్టీకి ఆధిక్యం ఉంటుంది. బ్రిటీష్ కొలంబియా 42 సీట్లతో కీలకంగా ఉన్నాయి. ఇక్కడ 2 శాతం కనర్జర్వేటివ్ ఆధిక్యంలో స్వల్పంగా ఉంది. ఒంటారియా 121 సీట్లలో లిబరల్స్ కు 7 శాతం లీడ్ లో ఉంది.
కెనడా ఎన్నికల్ని తారుమారు చేసిన ట్రంప్ ప్రకటనలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.