Naga Chaitanya: నాగ చైతన్య సోషల్ మీడియాను పెద్దగా వాడరు. ఆయన యాక్టీవ్ గా ఉండరు. కేవలం తన సినిమాల ప్రమోషన్స్ లేదా… కొన్ని ముఖ్యమైన విషయాల మీద మాత్రమే స్పందిస్తారు. సోషల్ మీడియా వాడటం, అస్తమానం ఫోన్ చూడటం నాకు ఇష్టం ఉండదని నాగ చైతన్య గతంలో కూడా చెప్పాడు. అలాంటి నాగ చైతన్య ఒక షాకింగ్ పోస్ట్ పెట్టాడు. నా దగ్గరున్న $6 మిలియన్ డాలర్స్ పంచమంటారా? లేక నేనే ఉంచుకోవాలా? అని అడిగారు.
నాగ చైతన్య తన సోషల్ మీడియా అకౌంట్ లో… నేను కొన్నేళ్ల క్రితం $5 డాలర్స్ తో 100 బిట్ కాయిన్స్ కొన్నాను. ఇప్పుడు వాటి విలువ $6 మిలియన్ డాలర్స్(రూ.50.37 కోట్లు). నేను ఇతరులకు ఆ డబ్బు పంచాలి అనుకుంటున్నాను? మీ అభిప్రాయం ఏమిటీ? అని ఒక పోల్ పెట్టాడు. నాగ చైతన్య అధికారిక అకౌంట్ లో కనిపించిన ఈ పోల్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. మీరు ఎటు ధనవంతులే కాబట్టి మాకు డబ్బు పంచండి.. అని పలువురు కామెంట్స్ చేశారు.
అయితే ఆ పోస్ట్ నాగ చైతన్య పెట్టలేదు. ఆయన అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి ఈ మోసపూరిత పోల్ పెట్టారు. నిజమే అని నమ్మిన నెటిజెన్స్ స్పందించారు. నాగ చైతన్య అకౌంట్ హ్యాక్ కి గురైందని వివరణ ఇచ్చిన టీమ్… ఆ పోల్ ని డిలీట్ చేసింది. ఈ పరిణామం పరిశ్రమలో కలకలం రేపింది.
ప్రస్తుతం నాగ చైతన్య తండేల్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రాజు అనే ఒక జాలరి యువకుడు పాత్ర చేస్తున్నాడు. నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తుంది. చందూ మొండేటి దర్శకుడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. తండేల్ మూవీపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి.
మరోవైపు నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోనున్నాడు. వీరికి ఆగస్టు 8న నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ లో వివాహం అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే..