Fahadh Faasil: రెమ్యూనరేషన్ విషయం లో ‘పుష్ప’ మేకర్స్ కి చుక్కలు చూపిస్తున్న ‘ఫహాద్ ఫాజిల్’..2 భాగాలకు కలిపి ఎంత తీసుకున్నాడో తెలుసా!

ఆగష్టు 15న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదికి వాయిదా పడింది. అయితే రీసెంట్ గానే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, రీ రికార్డింగ్ తో సహా పూర్తి అయ్యిందని, డిసెంబర్ 6 న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుందని మేకర్స్ ఒక కొత్త అప్డేట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు అందించాడు.

Written By: Vicky, Updated On : October 9, 2024 6:32 pm

Fahadh Faasil

Follow us on

Fahadh Faasil: పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ములేపిన టాలీవుడ్ చిత్రాలలో ఒకటి పుష్ప. 2021 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా తెలుగులో కంటే హిందీ లో పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ‘తగ్గేదే లే’ మ్యానరిజమ్స్ చేసేవాళ్ళు. ఇప్పటికీ ఈ మ్యానరిజం మన రొటీన్ లైఫ్ లో ఎదో ఒక సందర్భంలో మనకి తెలియకుండానే ఉపయోగిస్తూ ఉంటాము. ఆ స్థాయిలో ప్రభావం చూపించింది ఈ సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే ఇక ఏ స్థాయిలో ఉండాలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం స్క్రిప్ట్ ని సిద్ధం చేయడానికి ఏడాదికి పైగా సమయం తీసుకున్న సుకుమార్, సినిమాని పూర్తి చేయడానికి ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు.

అందుకే ఆగష్టు 15న విడుదల అవ్వాల్సిన ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదికి వాయిదా పడింది. అయితే రీసెంట్ గానే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, రీ రికార్డింగ్ తో సహా పూర్తి అయ్యిందని, డిసెంబర్ 6 న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుందని మేకర్స్ ఒక కొత్త అప్డేట్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు అందించాడు. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్యారక్టర్ తర్వాత మలయాళం హీరో ఫహాద్ ఫాజిల్ చేసిన ‘భన్వర్ సింగ్ షికావత్’ క్యారక్టర్ కూడా అంతే పాపులర్ అయ్యింది. ఈ క్యారక్టర్ కారణంగానే షూటింగ్ బాగా ఆలస్యం అయ్యిందని అంటున్నారు. ఫహాద్ ఫాజిల్ ఇన్ని రోజులు బిజీ గా ఉండడం వల్ల డేట్స్ కేటాయించలేకపోయాడు. కానీ మూవీ టీం ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం తో డేట్స్ అతి కష్టం మీద సర్దుబాటు చేసి ఇచ్చాడు.

గత వారం రోజుల నుండి ఆయనపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే పుష్ప సిరీస్ కోసం ఫహాద్ ఫాజిల్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. పుష్ప 1 కోసం ఆయన 3 కోట్ల 50 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకుంటే, పుష్ప 2 కోసం ఏకంగా 8 కోట్ల రూపాయిలను అందుకున్నాడు. అంటే రెండు భాగాలకు కలిపి 11 కోట్ల రూపాయలకు పైమాటే అన్నమాట. మలయాళం ఇండస్ట్రీ మిగిలిన ఇండస్ట్రీ లతో పోలిస్తే చాలా చిన్నది. భారీ హిట్స్ గా నిలిస్తే 100 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయి. మిగిలిన మామూలు హిట్ సినిమాలకు 100 కోట్ల రూపాయిల లోపే వస్తాయి. కాబట్టి ఫహాద్ అక్కడ హీరో గా నటించే సినిమాలకు కేవలం 6 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటాడు. హీరో గానే అంత తక్కువ తీసుకునే ఆయన ఇప్పుడు విలన్ క్యారక్టర్ కోసం ఏకంగా 11 కోట్లు డిమాండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఫహాద్ క్రేజ్ బాగా పెరిగింది, ఆయన వల్ల ఈ చిత్రానికి కచ్చితంగా లాభమే చేకూరుతుంది, అందుకే అంత రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేసినట్టు చెప్తున్నారు.