Dragon: ‘దేవర’ చిత్రంతో ఎన్టీఆర్ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. సినిమా విడుదలై 12 రోజులు పూర్తి అయ్యింది. ఇప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ జోరు ఏమాత్రం తగ్గలేదు. స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. ఊపు చూస్తుంటే దసరా పండుగ రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చేలా అనిపిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ లోనే ఈ చిత్రం 400 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్, త్వరలోనే ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాకి సీక్వెల్స్ చేస్తూ వస్తున్నాడు. కేజేఎఫ్ చిత్రం కూడా రెండు భాగాలుగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీసిన ‘సలార్’ చిత్రం కూడా రెండు భాగాలు ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. మొదటి భాగం పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది, త్వరలోనే రెండవ భాగం కి సంబంధించిన షూటింగ్ ని కూడా ప్రారంభించబోతున్నారు. ఎన్టీఆర్ తో తియ్యబోయే సినిమా కి కూడా సీక్వెల్ ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు. ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ తో మా అభిమాన నటుడు రెండు సార్లు కలిసి పని చేస్తే ఆ వాటి రికార్డ్స్ ని అందుకోవడం ఎవరి వల్ల కాదని అభిమానుల బలమైన నమ్మకం. కానీ ఈ చిత్రానికి సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ లేదని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇది కేవలం స్టాండ్ ఎలోన్ చిత్రమని, దీనికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ని ప్లాన్ చేసే స్కోప్ లేదని ఆయన తేల్చేసాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రం కోసం భారీ క్యాస్టింగ్ ని ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కమల్ హాసన్ ఇందులో కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఆయన తో పాటు పాన్ ఇండియా లెవెల్ లో బిగ్గెస్ట్ స్టార్ డమ్ ఉన్న నటులను ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారట. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమా జనవరి 2026 వ సంవత్సరం లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ ప్రతీ సినిమాకి సంగీతం అందించే రవి బర్సుర్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నాడు. ‘దేవర’ తోనే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఎన్టీఆర్, ఇక ప్రశాంత్ నీల్ తో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాడో చూడాలి.