మంచి ఎమోషన్ తో నడిచే సినిమాలో ఎమోషనల్ రోల్ అంటే మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రనే అనుకోవాలి. అలాంటి పాత్రలో నదియా నటిస్తోంది అంటే ‘అత్తారింటికి దారేది’ తర్వాత ఆమెకు దొరికిన మరో గొప్ప పాత్ర ఇది. మొత్తానికి పవన్ అత్త, రామ్ కి ఇప్పుడు తల్లి అన్నమాట. నదియాకిప్పుడు 54 ఏళ్ళు.. కాబట్టి మరో పదేళ్లు వరకు ఆమె కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదు.
ప్రస్తుతం ఈ సీనియర్ బ్యూటీ ముంబైలోనే ఉంటుంది. అన్నట్టు నదియా కూతురు ఇటీవల యూనివర్సిటీలో చేరింది. కూతురు పై చదువులకు వెళ్లడంతో నదియాకి ఇంటి బాధ్యతలు కూడా తగ్గాయట. అందుకే మళ్ళీ సినిమాలకు వరుసగా సైన్ చేస్తోంది. ఇక రామ్ – లింగుస్వామి డైరెక్షన్ లో ఈ సినిమా షూటింగ్ మొన్న గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే.
కాగా ఈ రోజు నదియా షూటింగ్ లో జాయిన్ అయింది. రామ్, నదియా పై కీలక సీన్స్ ను లింగుస్వామి తీస్తున్నాడు. ఇక ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెది ఫుల్ గ్లామరస్ రోల్ అట.