https://oktelugu.com/

‘సాయి తేజ్’తో బాగా కుదిరిందంటున్న నభా నటేష్ !

గతేడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా సాధించిన ఘన విజయంతో.. ఆ సినిమాలో నటించిన నభా నటేష్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నన్ను దోచుకుందువటే సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకున్నా సినిమా ఫ్లాప్ కావడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. రెండవ సినిమా ఇస్మార్ట్ శంకర్ తో అభిమానులకి పిచ్చెక్కింది. ఆ తరువాత వరుస అవకాశాలతో సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. ఇప్పుడు “సోలో బ్రతుకే సో బెటర్” అంటూ వస్తున్న […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 08:07 PM IST
    Follow us on


    గతేడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమా సాధించిన ఘన విజయంతో.. ఆ సినిమాలో నటించిన నభా నటేష్ కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నన్ను దోచుకుందువటే సినిమాలో అందం, అభినయంతో ఆకట్టుకున్నా సినిమా ఫ్లాప్ కావడంతో ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. రెండవ సినిమా ఇస్మార్ట్ శంకర్ తో అభిమానులకి పిచ్చెక్కింది. ఆ తరువాత వరుస అవకాశాలతో సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. ఇప్పుడు “సోలో బ్రతుకే సో బెటర్” అంటూ వస్తున్న మూవీలో సాయిధరమ్ తేజ్ కు జోడీగా నభా నటేష్ నటించింది.

    Also Read: పవన్ ఫ్యాన్స్ కి థమన్ పూనకాలు తెప్పిస్తాడట

    ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఈ ముద్దుగుమ్మ మీడియాతో మాట్లాడుతూ…ఈ సినిమాతో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. సినిమా గురించి, సినిమాలో తను పోషించిన అమృత పాత్ర గురించి కీలక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందని, థియేటర్లలో సినిమా విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. హీరో సాయిధరమ్ తేజ్ తో కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.సాయి తేజ్ ఫ్రెండ్లీగా, తోటి నటులకు సపోర్టివ్ గా ఉంటారని వెల్లడించారు.తనకు భవిష్యత్తులో ఛాలెంజింగ్ రోల్స్ లో నటించాలని ఉందని ఆమె అన్నారు.

    Also Read: అభిజీత్ పేల్చిన బాంబుతో హర్ట్ అయిన హారిక ఫ్యాన్స్ ?

    సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా వస్తున్న”సోలో బ్రతుకే సో బెటర్” చిత్రంతో సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందించాడు. రావు రమేష్,రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, సత్య మొదలగు వారు ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.కరోనా కారణంగా థియేట‌ర్లు మూసివేయ‌డంతో ఈ మూవీ విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్నిథియేట‌ర్ల‌లో క్రిస్మ‌స్ కానుక‌గా ఈ నెల 25న విడుద‌ల చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్