https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : 2వ స్థానంలో నబీల్.. మరి గౌతమ్, నిఖిల్ పరిస్థితి ఏమిటి..? మిస్ డ్ కాల్స్ ఎవరికి ఎక్కువ వచ్చాయి? ఫినాలేలో ట్విస్టుల మీద ట్విస్టులు!

గౌతమ్ అభిమాన హీరో రామ్ చరణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన అభిమాన హీరో చేతుల మీదుగా నేడు దాదాపుగా గౌతమ్ కప్పు ఎత్తడం ఖరారు అయ్యినట్టే అనుకోవచ్చు. అధికారికంగా కాసేపట్లో తెలియనుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2024 / 10:43 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ షో లో అన్ లిమిటెడ్ ట్విస్టులు ఉంటాయని హోస్ట్ నాగార్జున ఒక రేంజ్ లో ఊదరగొట్టాడు. కానీ ఆ రేంజ్ ట్విస్టులు పెద్దగా ఇన్ని ఎపిసోడ్స్ లో కనపడలేదు కానీ, ఫినాలే ఎపిసోడ్ మాత్రం ప్రతీ షాట్ క్లైమాక్స్ లాగా ఉంది అనే రేంజ్ లో ఉంటుందట. ఇప్పటికే ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసారు. ప్రేరణ కచ్చితంగా టాప్ 3 కంటెస్టెంట్ అనుకున్నారు. సోషల్ మీడియా పోల్స్ లో ఎక్కడ చూసిన ప్రేరణనే టాప్ లో ఉన్నింది. కానీ అధికారికంగా మాత్రం ఆమెకి నాల్గవ స్థానం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టాప్ 4 లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ కి సూట్ కేసు ఆఫర్ ఇచ్చారని నిన్నంతా సోషల్ మీడియా లో ప్రచారం అయ్యింది. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. టాప్ 3 కి సూట్ కేసు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

    ఇదంతా పక్కన పెడితే మరో షాకింగ్ న్యూస్ ఈరోజు ఉదయం నుండి ప్రచారం లో ఉన్నది. రన్నరప్ స్థానం లో నబీల్ ఉన్నాడని టాక్. మరి మొదటి స్థానంలో నిఖిల్ ఉన్నాడా, లేదా గౌతమ్ ఉన్నాడా అంటే, 99 శాతం గౌతమే ఉన్నాడట. అతనికి హౌస్ మేట్స్ అందరికంటే కనీవినీ ఎరుగని రీతిలో మిస్సెడ్ కాల్స్ ఎక్కువ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక నిఖిల్ మూడవ స్థానం తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని టాక్. ఇది నిజమైతే ఆయన అభిమానులకు గుండెలు ఆగినంత పని అవుతుంది. గౌతమ్ విన్నర్ అయినా తట్టుకోగలరు కానీ, సోషల్ మీడియా పోల్స్ లో కనీసం 5 శాతం ఓటింగ్ కూడా పాదనటువంటి నబీల్ రెండవ స్థానం లో ఉన్నాడు అనేది జీర్ణించుకోలేని విషయం. నబీల్ కి సోషల్ మీడియా ఓటింగ్ తక్కువ ఉంది ఉండొచ్చు. కానీ అతని ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని చూస్తే అందరికీ ఒక ఐడియా వస్తుంది.

    తెలుగు ఆడియన్స్ ఆయన్ని అనుసరించేది చాలా తక్కువ. కానీ ఇతర రాష్ట్రాల్లో నబీల్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. అంతే కాకుండా వరంగల్ ప్రజలు మొత్తం తమ ముద్దు బిడ్డని గెలిపించుకోవడానికి యూనిటీ చూపించారని తెలుస్తుంది. వాళ్ళు ఓట్లు వేయడం కాకుండా, దేశవ్యాప్తంగా తమ బంధువులతో కూడా ఓట్లు వేయించేలా నబీల్ సోదరుడు గత నెల రోజుల నుండి ఒక రేంజ్ క్యాంపైన్ చేసాడట. దాని ఫలితమే ఈరోజు ఆయన్ని టాప్ 2 రేస్ లో నిలబడేలా చేసిందని విశ్లేషకులు అంటున్నారు. ఇకపోతే ఈ ఫినాలే కి ముఖ్య అతిథి గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడు. గౌతమ్ అభిమాన హీరో రామ్ చరణ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన అభిమాన హీరో చేతుల మీదుగా నేడు దాదాపుగా గౌతమ్ కప్పు ఎత్తడం ఖరారు అయ్యినట్టే అనుకోవచ్చు. అధికారికంగా కాసేపట్లో తెలియనుంది.