https://oktelugu.com/

India WTC Final Equations:  టీమిండియా పాలిట విలన్ గా వరుణుడు.. ఒకవేళ గబ్బా టెస్ట్ డ్రా అయితే.. భారత్ WTC ఫైనల్ సమీకరణాలు ఇలా..

శనివారం బ్రిస్బేన్ లో విస్తారంగా వర్షం కురిసింది. ఫలితంగా తొలిరోజు ఆట మొత్తం వర్షార్పణం అయింది. 80 బంతులు మాత్రమే భారత బౌలర్లు వేయగలిగారు. ఒకవేళ వర్షం కురవకుండా ఉండి ఉంటే.. మ్యాచ్ స్వరూపం మరో విధంగా ఉండేది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 15, 2024 / 10:46 AM IST

    India WTC Final Equations

    Follow us on

    India WTC Final Equations: రెండవ రోజు ఆట మొదలైంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 104 రన్స్ చేసింది. స్మిత్(24), హెడ్(20) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. బుమ్రా రెండు వికెట్లు సాధించాడు.. నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టాడు. మోకాలు గాయంతో మహమ్మద్ సిరాజ్ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. తొలి రోజు ఆట వర్షం వల్ల రద్దు కావడంతో.. భారతీయ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశాలుంటాయి.. దీంతో ఈ మ్యాచ్లో ఫలితం రావాలని టీమ్ ఇండియా అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. మరో మాటకు తావు లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. మైదాన పరిస్థితిని అంచనా వేసి రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ నిర్ణయం సరైనది కాదని శనివారం భారతీయ బౌలర్లు నిరూపించారు. ఎందుకంటే 80 బంతులు వేసినప్పటికీ ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. ఈ మధ్యలో వర్షం పదేపదే అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిర్వహించడానికి అవకాశం లభించలేదు. మరోవైపు ఈ మైదానం పరిసర ప్రాంతాల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వార్త భారతీయ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే భారత జట్టుకు ఈ మ్యాచ్ అత్యంత ముఖ్యం. దీంతోపాటు మిగతా రెండు మ్యాచ్లు కూడా గెలిస్తేనే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే ఈ మ్యాచ్ కొనసాగాలని.. భారత జట్టుకు అనుకూల ఫలితం రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక డ్రా అయితే పాయింట్ల పట్టికలో మార్పు ఉండదు. ఇది భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ గనుక డ్రా అయితే.. తదుపరి రెండు టెస్ట్ మ్యాచ్ లలో భారత్ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత మిగతా జట్లు సాధించే విజయాల ఆధారంగా భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అవకాశం ఉంటుంది.

    విజయాల శాతం ఎలా ఉందంటే..

    గబ్బా టెస్ట్ ఒకవేళ డ్రా అయితే ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సంటేజ్ 58.89 కు చేరుకుంటుంది. భారత విజయాల శాతం 55.88 నమోదవుతుంది. ఫలితంగా భారత్ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా రెండవ స్థానంలో.. సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంటుంది. ఒకవేళ గబ్బా టెస్టులో భారత్ గనుక విజయం సాధిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది. ఆస్ట్రేలియా 56.67 విన్నింగ్ పర్సంటేజ్ తో మూడో స్థానానికి చేరుకుంటుంది. ఒకవేళ గబ్బాలో ఆస్ట్రేలియా గెలిస్తే పాయింట్లు పట్టికలో రెండవ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అయితే ఆస్ట్రేలియా విన్నింగ్ పర్సంటేజ్ దక్షిణాఫ్రికా ఫస్ట్ ప్లేస్ కు ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోతే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు వెళ్లడానికి ఇతర టీం రిజల్ట్ పై ఆధారపడాల్సి ఉంటుంది.