Border Gavaskar Trophy 2024 : రెండవ రోజు వర్షం తగ్గడంతో మ్యాచ్ పున: ప్రారంభమైంది. మైదానంపై పేస్ లభిస్తుండడంతో బుమ్రా తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. వెంట వెంటనే రెండు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(21) ను అవుట్ చేసిన బుమ్రా.. మరో ఓపెనర్ మెక్ స్వీనే(9) ను కూడా పెవిలియన్ పంపించాడు. మరో ఆటగాడు మార్కస్ లబూ షేన్(12) ను నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేశాడు. ప్రస్తుతం స్మిత్ (24), హెడ్ (17) క్రీజ్ లో ఉన్నారు. శనివారం రోజంతా వర్షం కురవగా.. ఆదివారం తెరిపినిచ్చింది.. దీంతో ఆటకు మైదానం అనుకూలంగా మారడంతో అంపైర్లు గేమ్ మొదలుపెట్టారు.. తొలి రోజు 80 బంతుల గేమ్ మాత్రమే సాధ్యం కాగా.. రెండవ రోజు అక్కడి నుంచి ఆటను పున: ప్రారంభించారు.
భారత్ కు షాక్
బ్రిస్బేన్ టెస్టులో టీమిండియా కు షాక్ తగిలింది. టీమ్ ఇండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేస్తుండగా అతడు మోకాలు నొప్పితో విలవిలలాడిపోయాడు. తీవ్రమైన బాధతో అతడు మైదానం నుంచి వెళ్లిపోయాడు. అయితే అతడిని స్కానింగ్ కు తీసుకెళ్తారా? విశ్రాంతి ఇస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో సిరాజ్ ఇప్పటివరకు 10.2 ఓవర్లు బౌలింగ్ వేశాడు. వికెట్లేమీ తీయలేకపోయాడు. రెండో టెస్టులో సిరాజ్, హెడ్ మధ్య వివాదం జరిగింది. ఈ వివాదంలో మహమ్మద్ సిరాజ్ పై ఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి మ్యాచ్ ఫీజులో 20% కోత విధించింది. ఈ వివాదం నేపథ్యంలో ఆస్ట్రేలియా మీడియా కూడా సిరాజ్ పై తన అక్కసు వెళ్లగక్కింది. ఇక శనివారం మొదలైన గబ్బా టెస్టులో సిరాజ్ బౌలింగ్ చేస్తుండగా ఆస్ట్రేలియా అభిమానులు హేళన చేశారు. అతనిని గేలి చేస్తూ కామెంట్లు చేశారు. దీనికి తగ్గట్టుగానే టీమిండియా అభిమానులు కూడా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా అభిమానులను ఒక ఆట ఆడుకున్నారు. ఇక ఆదివారం మ్యాచ్ మొదలు కాగానే కొద్ది ఓవర్లు వేసిన సిరాజ్.. ఆ తర్వాత మోకాలి నొప్పితో బాధపడ్డాడు. ఆ బాధను తట్టుకోలేక తీవ్రంగా విలవిలలాడిపోయాడు. అయితే అతడు ఈ మ్యాచ్ లో ఆడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. అతడిని టీమిండియా ఫిజియోథెరపిస్టుల బృందం మోకాలికి స్కానింగ్ చేయించడానికి తీసుకెళ్లింది. ఫిజియోల భుజాల మీద చేతులు వేస్తూ.. భారంగా అడుగులు వేస్తూ సిరాజ్ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. సిరాజ్ కు గాయం కావడంతో అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా కోల్పోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.a