Mythri Movie Makers: టాలీవుడ్ లో అతి తక్కువ సమయం లోనే అగ్ర స్థాయికి చేరుకున్న నిర్మాణ సంస్థ ఈమధ్య కాలం లో ఏదైనా ఉందా అంటే అది మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) మాత్రమే. ‘శ్రీమంతుడు’ చిత్రం తో కెరీర్ ని మొదలు పెట్టిన ఈ సంస్థ, ఇండస్ట్రీ లో అత్యధిక సక్సెస్ రేట్ ని మైంటైన్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకోవడమే కాకుండా, సరికొత్త ప్రయోగాలకు కూడా తెరలేపారు. ఉదాహరణకు 2023 వ సంవత్సరం లో ఈ సంస్థ నుండి తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ చిత్రాలను సంక్రాంతికి విడుదల చేశారు. కేవలం రెండు రోజుల గ్యాప్ లో విడుదలైన ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ ఏడాది కూడా అలాంటి ప్రయోగమే ఒకటి చేసి సక్సెస్ అయ్యారు.
ఈ బ్యానర్ పై తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మరియు ‘జాట్’ చిత్రాలు ఒకే రోజున విడుదల అయ్యాయి. రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా సూపర్ హిట్స్ అయ్యాయి. ఇలా ప్రయోగాలు చేయడం, సక్సెస్ లు అందుకోవడం ఈ సంస్థ కు సర్వ సాధారణం అయిపోయింది. అందుకే ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా చెయ్యని ఒక ప్రయోగాన్ని చేయడానికి సిద్ధమైనట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రామ్ చరణ్(Global Star Ram charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రాలు ఈ సంస్థలోనే తెరకెక్కుతున్నాయి. ‘పెద్ది ‘ చిత్రం మార్చ్ 27 న విడుదల చేయబోతున్నామని ఇది వరకే ప్రకటించారు. అయితే ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని కూడా మార్చ్ 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలు ఇలా పక్క పక్కనే విడుదల అవ్వడం ఇప్పటి వరకు హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు. మెగా అభిమానులు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే బలంగానే వినిపిస్తుంది. మరో పక్క పెద్ది చిత్రం షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉందని, జూన్ నెలకు వాయిదా పడే అవకాశం ఉందనే రూమర్ ప్రచారం జరుగుతుంది. మరోపక్క షూటింగ్ జనవరి నెలాఖరు లోపు పూర్తి అవుతుంది, మార్చ్ 27 న ఎట్టి పరిస్థితిలోనూ పెద్ది చిత్రం వస్తుందనే వార్త కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఈ రెండిట్లో ఏది నిజం అవ్వబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి. ప్రస్తుతానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కంటే ‘పెద్ది’ కి ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ రెండు సినిమాలు పక్క పక్కనే విడుదలైతే కచ్చితంగా పెద్ది చిత్రానికే ఎక్కువ వసూళ్లు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.