Rajamouli: ఇండస్ట్రీలో సక్సెస్ ఒక్కటే మాట్లాడుతుంది. ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా ఒక్క సక్సెస్ వస్తే మాత్రం ఇండస్ట్రీ మొత్తం వాళ్ల గురించి మాట్లాడుకుంటుంది. ఇక ఫెయిల్యూర్ లో ఉంటే మాత్రం వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. సరైన అవకాశాలు కూడా రావు… ఇక రాజమౌళి లాంటి దర్శకుడు ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. 100% సక్సెస్ రేట్ తో ముందుకు దూసుకెళ్తున్నాడు. కానీ రాజమౌళి సినిమాలో నటించిన హీరోయిన్లు మాత్రం పెద్దగా సక్సెస్ లను సాధించలేకపోతున్నారు…’స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా నుంచి ‘త్రిబుల్ ఆర్’ వరకు ఆయన సినిమాల్లో నటించిన హీరోయిన్లు ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోవడం విశేషం…మొదటి సినిమాలో గజాల హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత ఆమె కెరియర్ నిలబడలేకపోయింది. సై సినిమాలో జెనీలియా చేసింది. ఆమె కూడా పెద్దగా రాణించలేదు. ఇక సింహాద్రి సినిమాలో చేసిన భూమిక, అంకిత సైతం ఆ తర్వాత వాళ్ళ కెరియర్ ని కోల్పోయారు. ఛత్రపతి సినిమాలో చేసిన శ్రేయ అప్పటికి స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికి ఆ తర్వాత ఆమెకు అవకాశాలు కరువయ్యాయి.
‘విక్రమార్కుడు’ సినిమాలో చేసిన అనుష్క కి ఆ తర్వాత కొన్ని ప్లాప్ లు వచ్చాయి… ఇలా రాజమౌళి సినిమాలో చేసిన హీరోయిన్లందరూ షెడ్డు కి వెళ్లిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది…అందుకే రాజమౌళి సినిమాలో చేస్తే సక్సెస్ వస్తుందనే నమ్మకం ఉన్నప్పటికి ఆ తర్వాత కెరియర్ పెద్దగా ఉండదనే ధోరణిలో చాలామంది హీరోయిన్లు అతని సినిమాలో నటించడానికి భయపడుతున్నారు…
ఇక ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఇప్పటికే ప్రియాంక చోప్రా స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. ఆమెకి హాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. ఆమెను తీసుకోవడం వల్ల హాలీవుడ్ మార్కెట్ కి కూడా యూస్ అవుతుందనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఆమె ను సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రియాంక చోప్రా కెరియర్ ఎలా ఉండబోతోంది అనే ధోరణిలోనే ఇప్పుడు ఆమె అభిమానులు సైతం కొంతవరకు కంగారు పడుతున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో రాజమౌళి మరో సక్సెస్ ని సాధించి తన హీరో, హీరోయిన్లకు ఎలాంటి ఇమేజ్ ని సంపాదించి పెడతాడు అనేది…