Murali Nayak Biopic: ఆపరేషన్ సింధూర్(#OperationSindhoor) లో 23 ఏళ్ళు నిండిన వీర జవాన్ మురళి నాయక్(Murali Nayak) పాకిస్థాన్ ఆర్మీ తో విరోచితం గా పోరాడి ప్రాణాలను వదిలిన ఘటన యావత్తు భారతదేశ ప్రజలను శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. ఇంత చిన్న వయస్సులో తన తోటి కుర్రాళ్లతో కలిసి ఎంజాయ్ చేయాల్సింది పోయి, దేశం మీద పిచ్చి ప్రేమతో ఆర్మీ లో చేరి తన ప్రాణాలను సంతోషంగా దేశం కోసం అర్పించాడు. మురళి నాయక్ పార్థివ దేహాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan),నారా లోకేష్ లు సందర్శించి నివాళ్లు అర్పించడమే కాకుండా, ఆ కుటుంబానికి ప్రభుత్వం తరుపున, అదే విధంగా వ్యక్తిగతంగా ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ని అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. స్వతహాగా మురళి నాయక్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. జీవితం లో ఒక్కసారి అయినా ఆయన్ని కలిసి ఫోటో దిగాలని ఆశ పడ్డాడు.
Also Read: 5వ రోజు హిందీ లో కూడా భారీగా పడిపోయిన ‘వార్ 2’ వసూళ్లు..తెలుగులో అయితే క్లోజ్!
తాను ఎంతగానో అభిమానించిన హీరోనే తన కోసం వచ్చి ‘జోహార్ మురళి నాయక్’ అని నినాదాలు చేసేలా చేసుకున్నాడు మురళి నాయక్. ఇదంతా పక్కన పెడితే ఇతని బయోపిక్ లో హీరో గా నటించడానికి బిగ్ బాస్ సీజన్ 8(Bigg Boss 8 Telugu) కంటెస్టెంట్, రన్నరప్ గౌతమ్ కృష్ణ(Gautham Krishna) ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని నిన్న స్వయంగా మూవీ యూనిట్ ప్రెస్ మీట్ పెట్టి అధికారిక ప్రకటన చేసింది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కె. సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ‘రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ సమయం లో శత్రుదేశం తో వీరోచితంగా పోరాడి తన ప్రాణాలను అర్పించిన మురళి నాయక్ బయోపిక్ లో నేను నాయక్ పాత్ర చేస్తున్నముడుకు ఎంతో గర్వపడుతున్నాను. ఒక తెలుగు జవాన్ గురించి ఇప్పటి వరకు మన దేశం లో సినిమా తెరకెక్కలేదు’.
‘ఇప్పుడు మేము తీయబోతున్న సినిమానే మొట్టమొదటి సినిమా. ఈ చిత్రాన్ని మేము తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా తెరకెక్కిస్తున్నాం. అవకాశం ఉంటే ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లడానికి కూడా మా నిర్మాత ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అందుకు నేను ఆయనకు కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్న నాయక్ తల్లితండ్రులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. గౌతమ్ కృష్ణ రీసెంట్ గానే సోలో బాయ్ అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. కానీ మురళి నాయక్ బయోపిక్ లో ఒక మంచి ఎమోషన్ ఉంది, ఈ చిత్రాన్ని సరిగా డీల్ చేయగలిగితే కోలీవుడ్ లో అమరన్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఈ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది. మరి ఎలా డీల్ చేస్తారో చూడాలి.